నిహారిక కొణిదెల నుంచి నిహారిక జొన్నలగడ్డగా మారాక నిహారిక ఎక్కువగా మీడియాలో కనిపించింది. పెళ్లి, హనీమూన్, వెకేషన్స్ అంటూ చైతన్యతో నిహారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఆ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. విడాకుల తర్వాత నిహారికపై మీడియా గట్టిగానే నిఘా పెట్టింది. అటు నిహారిక కూడా ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన విషయాలన్నీ షేర్ చేస్తుంది. గత పది రోజులుగా నిహారిక మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది.
అన్న వరుణ్ తేజ్ పెళ్లిలో స్పెషల్ గా డాన్స్ చ్చేస్తూ అదరగొట్టిన నిహారిక.. ఇటలీ నుంచి రాగానే రిసెప్షన్ లో గ్లామర్ గా సూపర్బ్ అనిపించింది. అది ముగియగానే నిర్మాతగా కొత్త బాధ్యతని ఎత్తుకుంది. నిహారిక నిర్మాతగా ఓ సినిమాని గ్రాండ్ గా కొత్తపెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అంటే వరుణ్, లావణ్యలతో చేతుల మీదుగా మొదలు పెట్టింది. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ తనకి ఎంతో ఇష్టమైన వారంటూ వాళ్ళ పేర్లు చెప్పుకొచ్చింది.
ఆ వీడియోలో నిహారిక లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతి రాజ్, నిహారిక తల్లి ఉన్నారు.. నా లైఫ్ లోకి వచ్చిన మీరందరికి కృతఙ్ఞతలు, మీతో గడిపిన క్షణాలను ఎప్పటికిమరిచిపోలేను, లవ్ లెటర్ టు మై ఏంజెల్స్ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది. నిహారిక పోస్ట్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.