కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ దేవర ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అనే న్యూస్ తోనే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటే.. దేవర పై ఏదో ఒక అప్ డేట్ మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులని అబ్బుర పరుస్తూనే ఉంది. ఎన్టీఆర్ రీసెంట్ గానే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మెగాస్టార్ ఇంట్లో జరిగిన దివాళి పార్టీలో మెరిశారు. తదుపరి రోజు అంటే దివాళి రోజు భార్య పిల్లలతో కలిసి దివాళిని జరుపుకున్న పిక్ షేర్ చేసి అభిమానులని సర్ ప్రైజ్ చేసారు.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవరలో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని అంటున్నారు. ఇక గత రెండు రోజులుగా అంటే దివాళి ఫెస్టివల్ సందర్భంగా కొంచెం బ్రేక్ తీసుకొని, తమ హార్డ్ వర్కింగ్ టీమ్ సెట్స్ లో ఎపిక్ షెడ్యూల్ కోసం తిరిగి వచ్చినట్లుగా మేకర్స్ క్రేజీ గా ఇచ్చిన అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే కాదు దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5, 2024 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయాన్ని మరోసారి టీమ్ కన్ ఫర్మ్ చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుండగా.. పవర్ ఫు విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.