బిగ్ బాస్ సీజన్ 7 లో ఉల్టా ఫుల్టా అంటూ కన్ఫ్యూజ్ చేసి నిన్నటివరకు టాప్ 5 లో ఎవరుంటారో అనేది ఓ క్లారిటీ లేకపోయినా.. ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాక తర్వాత టాప్ 5 ఎవరు అనేది బుల్లితెర ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేసారు. అందులో పల్లవి ప్రశాంత్, శివాజీ, అర్జున్, యావర్, అమర్ లేదా ప్రియాంక వీరు టాప్5 లో ఉండబోయే కంటెస్టెంట్స్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. అయితే టాప్ 5 కి ఓ అంచనాకి వచ్చేసిన ప్రేక్షకులు ఇప్పుడు విన్నర్ పై కూడా అంచనాకు వస్తున్నారు.
ఎక్కువగా శివాజీకి బిగ్ బాస్ 7 ట్రోఫీకి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటే.. కొంతమంది మాత్రం శివాజీ ది కన్నింగ్ గేమ్.. పల్లవి ప్రశాంత్, యావర్, భోలే, రతిక లాంటి వాళ్లతో తన పగని తీర్చుకుంటూ తెలివిగా గేమ్ ఆడుతున్నాడంటూ అతనిపై ఓ అభిప్రాయానికి వస్తున్నారు. మరోపక్క రైతు బిడ్డగా సింపతీ క్రియేట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ క్రేజ్ కూడా శివాజీకి పోటీగా స్ట్రాంగ్ గా కనబడుతుంది. వీరిద్దరిలోనే విన్నర్ ప్లేస్ ఉంటుంది.
అయితే శివాజీ లేదంటే పల్లవి ప్రశాంత్ ల చేతిలోనే బిగ్ బాస్ సీజన్7 ట్రోఫీ వెళుతుంది అంటున్నారు. అంటే వారిద్దరే టాప్ 2 లో ఉండబోయే కంటెస్టెంట్స్ గా జనాలు తేల్చేస్తున్నారు.