Advertisementt

BB7 : రైతు బిడ్డని రెచ్చగొట్టిన అర్జున్

Tue 14th Nov 2023 10:02 AM
bigg boss 7  BB7 : రైతు బిడ్డని రెచ్చగొట్టిన అర్జున్
BB7: Arjun AMbati vs Pallavi Prashanth BB7 : రైతు బిడ్డని రెచ్చగొట్టిన అర్జున్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడు పల్లవి ప్రశాంత్.. ఇది హౌస్ మేట్స్ మాత్రమే కాదు, ప్రతి బుల్లితెర ప్రేక్షకుడు మాట్లాడుతున్న మాట. ఈ రోజు అపర చాణుక్యుడిగా కనిపించే శివాజీ తో కలిసి బిగ్ బాస్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాడు అంటే.. అతని క్రేజ్ బయట, లోన ఎంతగా ఉందో అర్ధమవుతుంది. పల్లవి ప్రశాంత్ ని మొదటి రెండు వారాలు నామినేట్ చేసి అమరదీప్ వీకైపోయాడు. పల్లవి ఫాన్స్ బయట అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే.. శివాజీ ప్రతి వారం అమర్ ని డేంజర్ లో పెట్టాడు.

ఇక పల్లవి ప్రశాంత్ విషయంలో సందీప్ మాస్టర్ తప్పటడుగు వేసాడు. ఒక నామినేషన్స్ లో గొడవ పెట్టుకుని పల్లవి ఫాన్స్ కి టార్గెట్ అయ్యాడు. అతను నామినేషన్స్ లోకి వచ్చిన వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇక అంబటి అర్జున్ కూడా ఏకులా వచ్చి మేకులా పాతుకుపోయావంటూ పల్లవిని మెచ్చుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్ లో అర్జున్ అంబటి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసాడు. నువ్వు ఎవ్వరి సహకారం  లేకుండా నామినేషన్స్ చేస్తున్నావా.. శివాజీ అన్నని ఎవరో ఏదో అంటే నువ్వు నామినేట్ చేస్తున్నావ్, శివాజీ అన్న మొదటి వారం నీకు గైడ్ గా మారాడు, ఆయన చెబితేనే నువ్వు ఆడుతున్నావా, లేదుగా అనగానే.. పల్లవి ప్రశాంత్ కూడా ఎప్పటిలాగా యాటిట్యూడ్ చూపిస్తూ నేను ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ తో నామినేట్ చెయ్యలేదు, శివన్న చెప్పినట్టుగా చెయ్యలేదు.

నా అట నేను ఆడుతున్నాను అంటూ అర్జున్ తో ఫైట్ చేసాడు. పల్లవి ప్రశాంత్ ఎంత ఓవర్ చేసినా అర్జున్ కూడా అంతే వెటకారంగా రైతు బిడ్డగా అతి చేస్తున్న అతని ముసుగు తీసేసాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందికి ప్రశాంత్ అంటే నచ్చదు. కానీ అతన్ని నామినేట్ చేస్తే ఎక్కడ నెగెటివ్ అయ్యిపోతామో అనే భయం, పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ శివాజీ చుట్టూ తిరగడం కూడా చాలామందికి నచ్చడం లేదు. అదే ఇప్పుడు అర్జున్ పల్లవి యాటిట్యూడ్ ని బయటపెట్టాడు. 

BB7: Arjun AMbati vs Pallavi Prashanth:

Bigg Boss 7: 11th weak nominations highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ