మలయాళ కుట్టి మాళవిక మోహనన్ ఎప్పుడూ గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తుంది. సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే మాళవిక మోహనన్ కి ఇంకా సరైన హిట్ దొరకలేదు. కానీ స్టార్ హీరోలతో మాత్రం వరసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న మాళవిక మోహనన్ తమిళనాట మహా బిజీ. నయనతారపై అప్పుడప్పుడు ఇండైరెక్ట్ కామెంట్స్ తో హడవిడి చేసే ఆమె సోషల్ మీడియా క్వీన్.
ఇక నిన్న దివాళీ సందర్భంగా మాళవిక మోహనన్ ఓ పిక్ పోస్ట్ చేసింది. సహజంగా హీరోయిన్స్ అయినా, ఎవరైనా ఫెస్టివల్స్ కి పద్దతిగా బట్టలు వేసుకున్నట్టే మాళవిక మోహనన్ కూడా శారీలో కనిపించింది. అయితే మాళవిక మోహనన్ ఇంత పద్ధతిగా ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడు చూడు గ్లామర్ డ్రెస్సులతో అందాలు ఆరబోసే మాళవిక ఇలా నిండుగా శారీ కట్టుకుని అదరగొట్టేసింది. శారీలోను అందాలను డిఫ్రెంట్ గా ఆరబోసే మాళవిక ఈసారి దివాళీలో పద్దతిగా శారీలో నిండుగా అందంగా కనబడింది.
అలా చూసిన మాళవిక మోహనన్ ని ఫస్ట్ టైమ్ పద్దతిగా ఉన్నావ్ అమ్మడు అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక శారీ ఫోటో ట్రెండ్ అవుతున్న సమయంలోనే ఈరోజు సోమవారం మాళవిక మోహనన్ మరికాస్త గ్లామర్ పిక్స్ ని షేర్ చేసింది.