రాజమౌళి తో మహేష్ బాబు ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత అప్పుడే ఏడాదిన్నరగా ఖాళీగా కనిపిస్తున్నారు. అటు మహేష్ గుంటూరు కారం షూటింగ్ లో ఉన్నాడు. అది సంక్రాంతికి రిలీజ్ ఉంటే.. మహేష్ రాజమౌళితో మార్చ్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. సూపర్ స్టార్ ఫాన్స్ మాత్రం రాజమౌళితో త్వరగా మూవీ మొదలవ్వాలని ఎదురు చూస్తున్నారు. కానీ అది ఇంకా ఇంకా లేట్ అవుతుంది. SSMB29 పై ఏ న్యూస్ వచ్చినా అది చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతుంది.
తాజాగా రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రాజమౌళి ఈ విషయంలో స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారట. కథ కూడా అందుకు అనుగుణంగానే రెడీ చేస్తున్నారట. మరి రాజమౌళి బాహుబలి విషయంలో రెండు భాగాలతో సూపర్ సక్సెస్ ఆయారు. ఆర్.ఆర్.ఆర్ కి సీక్వెల్ ఉంటుంది అన్నారు. అది అంత ఇమ్మిడియట్ గా చెయ్యాల్సిన పని లేదు. కానీ మహేష్ తో చేయబోయేది రెండు పార్టులు అంటే.. బ్యాక్ టు బ్యాక్ రెడీ చేసి రిలీజ్ చెయ్యాలి. అంటే మహేష్ మరో ఐదేళ్లు కనిపించరని అర్ధమే.
అయినా పర్లేదు మహేష్ ప్యాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అవ్వాలనేది సూపర్ స్టార్ అభిమానుల సంకల్పం. అది రాజమౌళి తోనే సాధ్యమని వారు నమ్ముతున్నారు. ఇక ఈచిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతుంది అని రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో చెప్పారు.