గత శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంట దివాళి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. దివాళి బాష్ అంటూ టాలీవుడ్ సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో ఈ పార్టీ కళకళలాడింది. ఎన్టీఆర్ ఆయన వైఫ్, అల్లు అర్జున్ ఆయన వైఫ్, మహేష్ ఆయన వైఫ్, నాగార్జున ఆయన వైఫ్, వెంకీ ఆయన వైఫ్ ఇలా భార్యలతో సహా ఈ పార్టీకి హాజరై ఎంజాయ్ చేసారు. మెగా ఫ్యామిలిలో రామ్ చరణ్-ఉపాసనలు పార్టీని హోస్ట్ చేస్తూ ప్రముఖులని ఆహ్వానిస్తారు.
ఇక ఈ పార్టీలో పాల్గొన్న పిక్స్ బయటికి రావడంతో హీరోల అభిమానులకి స్వీట్ సర్ ప్రైజ్ అయ్యింది. చిరు-వెంకీ-నాగ్ ఒకే ఫ్రెమ్ లో కనిపించగానే సీనియర్ హీరోలు అందరూ ఓకె.. కానీ ఈ పార్టీలో బాలయ్య మాత్రం మిస్ అయ్యారుగా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. చిరుకి బాలయ్యకి పడదు, అందుకే ఇప్పటివరకు అన్ స్టాపబుల్ షోకి మెగాస్టార్ హాజవ్వలేదు, అసలు ఇండస్ట్రీలో చిరు పెద్దరికం తీసుకోవడం బాలయ్యకి నచ్చదు.. ఇలా చాలా వాదనలు వాడుకలో ఉన్నాయి. ఇక పవన్ జనసేన తో టీడీపీ పొత్తు అని ప్రకటించాక కూడా మెగాస్టార్ చిరు బాలయ్యని దివాళి పార్టీకి ఆహ్వానించలేదా అనే అనుమానాలు వ్యకం చేస్తున్నారు.
ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ పార్టీలో సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున కనిపించగానే అందరికి బాలయ్య గుర్తుకు వచ్చాడు. బాలయ్య కూడా ఆ ఫ్రేమ్ లో ఉంటే అద్దిరిపోయేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారనడం కాదు కానీ.. ఈ పార్టీలో బాలయ్య ఫ్యామిలీ కూడా కనిపించి ఉంటే ఆ సందడి ఆ హంగామానే వేరు కదా..!