విజయ్ దేవరకొండ తో రష్మిక స్నేహం ఇప్పుడు ప్రేమగా మారింది అంటూ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రష్మిక-విజయ్ దేవరకొండ కలిసి వెకేషన్స్ కి వెళ్ళడం, లంచ్ కి వెళ్లడం, డిన్నర్ డేట్స్ అంటూ వెళుతున్నా అవన్నీ సీక్రెట్ గానే చేస్తున్నారు. మేము ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లకూడదా అంటూ తిరిగి అడిగే రష్మిక, విజయ్ మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప మారేది లేదు అని చెబుతారు.
కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఫ్యాన్స్ కి దొరికిపోతారు. తాజాగా విజయ్ దేవరకొండ తన అమ్మ, నాన్న, తమ్ముడు తో కలిసి తన ఇంట్లోనే దివాళి సెలెబ్రేషన్స్ చేసుకున్న పిక్స్ ని షేర్ చేసాడు. అదే సమయంలో రష్మిక కూడా సింగిల్ పిక్ ని షేర్ చేసింది. ఆ పిక్ కూడా విజయ్ దేవరకొండ ఇంటి దగ్గరే వున్నట్టుగా అనిపించడంతో.. విజయ్-రష్మిక అభిమానులు రెండు ఫోటోలని పక్క పక్కనబెట్టి ఒకే ఇంట్లో కలిసి దివాళి సెలెబ్రేషన్స్ చేసుకుని ఇప్పుడు వేరు వేరుగా ఫొటోస్ ని షేర్ చేసారు..
రశ్మిక అత్తారింట్లో దివాళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. రష్మిక శారీలో దివాళి ఫోజ్ ఇవ్వగా.. విజయ్ దేవరకొండ ఫెస్టివ్ అవుట్ ఫిట్ కుర్తా పైజామాలో కనిపించాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ టాక్ కి విజయ్ అండ్ రష్మిక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.