Advertisementt

BB7: రింగ్ మాస్టర్ శివాజీ

Mon 13th Nov 2023 11:10 AM
bigg boss 7  BB7: రింగ్ మాస్టర్ శివాజీ
BB7: Ring Master Shivaji BB7: రింగ్ మాస్టర్ శివాజీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో వయసుతో సంబంధం లేకుండా యూత్ తో పోటీ పడుతూ చాణుక్యుడిగా మారిన శివాజీ ఇప్పుడు రింగ్ మాస్టర్ గా కనిపిస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ మొదటి నుంచి యావర్, పల్లవి ప్రశాంత్ లని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు, వాళ్లతో తనకి నచ్చని వాళ్ళని టార్గెట్ చేయిస్తున్నాడని చాలామంది చెబుతున్నమాట. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ బ్యాచ్ లో భోలే కూడా అంతే. రీ ఎంట్రీ ఇచ్చిన రతిక అయితే శివాజీని గురువును చేసేంసింది. గత రాత్రి ఎపిసోడ్ లో హైపర్ ఆది శివాజీ గారికి నమస్కారం చేసాక నీలో మార్పు వస్తుంది. అన్న డైరెక్షన్ లో ముందుకు వెళతావు అనుకున్నాము కానీ.. నువ్వు ఎప్పటిలాగే అలానే ఉన్నావన్నాడు. మరి అది మైండ్ లో పెట్టుకుందో ఏమో.. ఈరోజు సోమవారం నామినేషన్స్ కి ముందు రతిక శివాజీని అడిగింది. ఎలా ముందుకు వెళ్ళాలి అని.

దానికి శివాజీ ఆమెకి దిశానిర్దేశం చేసాడు. నామినేషన్స్ లో నసగకు, నీ టాలెంట్ చూపించి, అవతలి వాడు నిన్ను క్వచ్చన్ చేయకుండా చేసుకో, అప్పటినుంచి గేమ్ అయ్యేవరకు ఆపకు అని హిత బోధ చేసాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో రతిక రెచ్చిపోయింది. శోభా శెట్టిని టార్గెట్ చేసి వాదన పెట్టుకుంది. నువ్వు కెప్టెన్ గా ఏం చేసావో చెప్పు అంది, కెప్టెన్ అంటే ఏమిటి అంది. ఆ తర్వాత అర్జున్ అంబటి కూడా శోభా శెట్టి ని టార్గెట్ చేసాడు. కెప్టెన్ గా ఏమి చేసావో చెప్పు, విఐపి రూమ్ దాటి రాలేదు అన్నాడు. దానికి కూడా శోభ శెట్టి గట్టిగానే సమాధానమిచ్చింది.

ఇక అర్జున్ పల్లవి ప్రశాంత్ ఎప్పుడైనా నువ్వు ఇండివిడ్యువల్ గా నామినేషన్స్ చేసావా.. నువ్వు గేమ్ ఇలా ఆడాలి అలా ఆడాలి అని శివాజీ అన్న చెబుతున్నాడా, అప్పుడే నువ్వు టాస్క్ ఆడుతున్నావా అంటూ పల్లవి ప్రశాంత్ ని అర్జున్ నామినేట్ చేసాడు. ఆ తర్వాత రతిక ప్రియాంకని టార్గెట్ చేసింది. నువ్వు టీచర్ వి నువ్వు అడిగినవి నేను చెప్పుకుంటూ పోవాలా అని ప్రియాంక రతికపై గొడవకి దిగింది. దానితో ఆన్సర్ టు మై పాయింట్ అంటూ రతిక రెచ్చిపోయిన ప్రోమో వైరల్ గా మారింది. 

BB7: Ring Master Shivaji:

Bigg Boss 7: Today promo viral

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ