Advertisementt

అవకాశమొచ్చినా అదృష్టం ఉండాలి

Mon 13th Nov 2023 10:32 AM
anu emmanuel  అవకాశమొచ్చినా అదృష్టం ఉండాలి
Unlucky Anu Emmanuel అవకాశమొచ్చినా అదృష్టం ఉండాలి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మెగా హీరోలు వరసగా సినిమా ఛాన్సులు ఇచ్చారు. కానీ అమ్మడుకి పిసిరంత కూడా అదృష్టం లేదు. గ్లామర్ చూపిస్తుంది, నటనలో కూడా మరీ తీసిపారేసేంత కాదు. అయినా పాపకి అస్సలు కలిసి రావడం లేదు ఒక్క కూడా హిట్ తగలడం లేదు. అసలు ఇంతగా అదృష్టం లేని ఆ భామ ఎవరో అని ఆలోచించేస్తున్నారా.. అదే మన అను ఇమ్మాన్యువల్ అండి. తెలుగులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని, అల్లు శిరీష్, శర్వానంద్ సినిమాలు.. ఇలా వరసగా అవకాశాలొచ్చాయి.

పద్దతిగా కాదు.. గ్లామర్ గానే హైలెట్ అవ్వాలనుకుంది. ఎడా పెడా అందాలు ఆరబోసింది. స్టార్ హీరోలు సినిమాలు ఇవేమి అనుని ఆదుకోలేదు. అల్లు శిరీష్ ఉర్వశివో అంటూ సక్సెస్ ఇచ్చాడు.. కానీ అను ని పిలిచి అవకాశం ఇవ్వడం లేదు టాలీవుడ్. సరే కోలీవుడ్ లో ఆయిన్ పాగా వేద్దామనుకుంది. అక్కడ కూడా కార్తీ ఆమెకి హ్యాండ్ ఇచ్చాడు. కార్తీ-అను ఇమ్మాన్యువల్ జంటగా వచ్చిన జపాన్ వార్తల్లో లేకుండా పోయింది. జపాన్ ప్రమోషన్స్, జపాన్ మూవీలోనూ గ్లామర్ గా రెచ్చిపోయింది.

అయినా పాప పరిస్థితిలో మార్పు లేదు. మరి అవకాశాలు వస్తున్నాయి.. కానీ అదృష్టమే అమ్మడుకి ఆమడదూరాన ఆగిపోయింది. జపాన్ డిసాస్టర్ తర్వాత అనుని కోలీవుడ్ కూడా లైట్ తీసుకోవడం ఖాయంగానే కనబడుతుంది. 

Unlucky Anu Emmanuel:

Anu Emmanuel Bad Luck Continues

Tags:   ANU EMMANUEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ