Advertisementt

బిగ్ బాస్ 7 స్టేజ్ పై బయటపడిన ప్రేమ

Mon 13th Nov 2023 09:42 AM
shobha shetty  బిగ్ బాస్ 7 స్టేజ్ పై బయటపడిన ప్రేమ
Shobha Shetty boyfriend entry in Bigg Boss stage బిగ్ బాస్ 7 స్టేజ్ పై బయటపడిన ప్రేమ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ ఫ్యామిలీ వీక్ లో వచ్చాడు. అతను వచ్చినప్పటినుంచి ప్రియాంకకి ముద్దులు పెడుతూనే ఉన్నాడు. అయితే బిగ్ బాస్ లో రతిక కి మాజీ లవర్ ఉన్నాడంటూ రాహుల్ సిప్లిగంజ్ ని లాగారు. ఆ విషయంలో బయట పెద్ద రాద్దాంతమే జరిగింది. ఇక అశ్విని విషయం ఎవరికీ క్లారిటీ లేకపోయినా.. శోభా శెట్టి మాత్రం ప్రేమలో ఉంది అనే విషయం ఈమధ్యనే రివీల్ చేసింది. కానీ అదెవరు అనేది చెప్పలేదు. ఇప్పుడు ఈ ఆదివారం దివాళి ఈవెంట్ లో ఆ విషయం బయటపడింది.

శోభాశెట్టి తండ్రితో పాటుగా ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా స్టేజ్ పై కనిపించాడు. దానితో అందరూ షాక్. అతనెవరో కాదు.. శోభా శెట్టి విలన్ మోనిత కేరెక్టర్ లో నటించిన కార్తీక దీపం నటుడు యశ్వంత్. ఆ సీరియల్ లో కార్తీక్ కి తమ్ముడిగా, సౌందర్యకి చిన్న కొడుకుగా నటించిన అతనే శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్. మూడున్నరేళ్లుగా దాచిన ప్రేమ ఇప్పటికి బయటపడింది అంటూ నాగార్జున కూడా శోభా శెట్టిని ఆటపట్టించారు. ఇక స్టేజ్ పై యశ్వంత్  శోభకు ఐ లవ్ యు చెప్పగా.. శోభా కూడా ఐ టూ లవ్ యు అంటూ హొయలు పోయింది.

యశ్వంత్ కి ముందుగా శోభా శెట్టి ప్రపోజ్ చేసినా.. తర్వాత యశ్వంత్ ఓకె చెప్పడంతో శివాజీ దగ్గర నుంచి నాగార్జున వరకు అప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సి వచ్చిందా అంటూ కామెడీ చెయ్యగా.. లేదు ఇష్టపడ్డాను అంటూ యశ్వంత్ ఎక్కడా తగ్గకుండా సమాధానమిచ్చాడు,. శోభా శెట్టిని భరిస్తున్నావ్ అంటే లేదు ప్రేమిస్తున్నా అంటూ యశ్వత్ తెలివిగా చెప్పాడు. 

Shobha Shetty boyfriend entry in Bigg Boss stage:

Bigg Boss 7: Diwali event special

Tags:   SHOBHA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ