Advertisementt

దివాళికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన తారక్

Sun 12th Nov 2023 09:13 PM
ntr  దివాళికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన తారక్
Tarak gave a big surprise for Diwali దివాళికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన తారక్
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్యామిలీతో పబ్లిక్ లో కనిపించడు. ఏ ఎయిర్ పోర్ట్ లోనో, లేదంటే వెకేషన్స్ లోనో అప్పుడప్పుడు భార్య తోను పిల్లలతోను కనిపిస్తాడు తప్ప.. మహేష్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీలా ఎక్కువగా తన ఫ్యామిలీని మీడియా ముందుకు తీసుకురాడు. ఇక గత రాత్రి మెగాస్టార్ ఇంటికి భార్య ప్రణతితో కలిసి దివాళి పార్టీ కోసం వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడ మహేష్, వెంకీ, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున ఇలా అందరితో కలిసి దివాళి బాష్ ని ఎంజాయ్ చెయ్యగా.. ఉపాసన, నమ్రత, ఇంకా రాజమౌళి కోడలు పూజలతో కలిసి లక్ష్మి ప్రణతి ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.

ఇక ఈరోజు దివాళి స్పెషల్ గా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ పిక్ ని ఇన్స్టా లో పోస్ట్ చేసాడు. కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి భార్య ప్రణతితో నే కనిపించగానే తారక్ ఫాన్స్ తెగ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎన్టీఆర్ వైట్ ఫెస్టివల్ అవుట్ ఫిట్ లో కనిపించగా.. ప్రణతి లావెండర్ కలర్ శారీలో క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. తారక్ కొడుకులు డిఫరెంట్ కలర్ అవుట్ ఫిట్స్ లో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన దివాళి పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Tarak gave a big surprise for Diwali:

NTR shares a beautiful family picture on the occasion of Diwali

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ