ఈరోజు ఉదయం నుంచి మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ రేవ్ పార్టీ ఇస్తూ దొరికిపోయింది. ఈ పార్టీకి వెళ్లిన సినీప్రముఖులు, బిగ్ బాస్ స్టార్స్ ని కూడా పులుసులు అరెస్ట్ చేసారు అంటూ ఛానల్స్ లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలు నిజం కాదు అటూ బిగ్ బాస్ హిమజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. హిమజ రేవ్ పార్టీ అంటూ న్యూస్ క్షణాల్లో స్ప్రెడ్ అవగా.. దానిని ఆపేందుకు హిమజ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఆ వీడియోలో తానేమి రేవ్ పార్టీ ఇవ్వలేదు, దివాళి సందర్భంగా నా ఫ్రెండ్స్ తో కలిసి కొత్తింట్లోనే సెలెబ్రేట్ చేసుకున్నాము, అది మీడియాలో చూపిస్తున్నట్టుగా ఫామ్ హౌస్ కాదు, నా సొంతిల్లు, అది కొత్తగా కట్టుకున్నాను కాబట్టి మొదటి దీపావళిని గ్రాండ్ గా చేసుకుందామని ఫ్రెండ్ ని పిలిచాను. అది రేవ్ పార్టీ అంటూ ఛానల్స్ వస్తున్న వార్తలతో నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తున్నారు. నా ఇంట్లో అలాంటిదేమీ జరగలేదు. మేము అరెస్ట్ అవ్వలేదు. మేము ఇంట్లోనే ఉన్నాము, పండగకి ఏర్పాట్లు చేసుకుంటున్నాము.
నా మీద ఛానల్స్ లో వస్తున్న వార్తలు నిజం కాదు. మా ఇంట్లో సెలెబ్రేషన్స్ జరుగుతుంటే ఎవరో పోలీసు లకి ఇన్ఫర్మ్ చెయ్యగా పోలీసులు అంతా సోదా చేసి వెళ్లారు. అయినా ఎలక్షన్స్ మూమెంట్ కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. రేవ్ పార్టీ అంటూ కథలు అల్లారు.. అందుకే నేను ఈ వీడియో చేసి వెంటనే షేర్ చేస్తున్నాను మీడియాలో నాపై వస్తున్నవన్నీ రూమర్స్ అంటూ హిమజ కొట్టిపారేసింది.