కరోనా సమయంలో టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు హీరోలు పెళ్లి పీటలెక్కారు. ఇక ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న శర్వానంద్ అప్పుడే గుడ్ న్యూస్ చెప్పాడు. శర్వా తండ్రికాబోతున్నాడు,. రక్షిత రెడ్డి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇక నితిన్, రానా, నిఖిల్ వీళ్లంతా ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వాళ్ల ఫాన్స్ వెయిట్ చెయ్యని క్షణం లేదు. ఇక కొద్దిరోజుల క్రితం నిఖిల్ భార్య పల్లవి తో విడిపోతున్నాడనే ప్రచారం జరగడం, నిఖిల్-పల్లవిలు ఆ న్యూస్ స్ప్రెడ్ అవకుండా ఓ షోకి జంటగా హాజరై ఆ రూమార్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు.
అయితే తాజాగా నిఖిల్ వైఫ్ పల్లవి ప్రెగ్నెట్, ఆమె బేబీ బంప్ కనిపించింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ ప్రస్తుతం స్వయంభు మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన విదేశాలకు వెళ్ళాడు. అయితే నిఖిల్ తన భార్య పల్లవిలో ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్ హైలెట్ అయినట్లుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మరి నిఖిల్ వైఫ్ పల్లవి ప్రెగ్నెంట్ అంటూ చెప్పడంతో ఆ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.