Advertisementt

హైపర్ ఆది కామెడీనే.. కామెడీ

Sun 12th Nov 2023 05:02 PM
bigg boss telugu 7  హైపర్ ఆది కామెడీనే.. కామెడీ
Hyper Aadi at Bigg Boss 7 stage హైపర్ ఆది కామెడీనే.. కామెడీ
Advertisement
Ads by CJ

హైపర్ ఆది ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ పంచ్ లు కోకోల్లలు, జబర్దస్త్ స్టేజ్ అయినా, ఢీ డాన్స్ షో అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా హైపర్ ఆది ఉంటే ఆ సందడే, ఆ క్రేజే వేరప్పా అన్నట్టుగా ఉంటుంది. అందుకే స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ ప్రతి సీజన్ లోను ఓ ఈవెంట్ కి ఆది ని గెస్ట్ గా తీసుకొచ్చి హౌస్ మేట్స్ పై కామెడీ చేయిస్తూ ఉంటారు. గత సీజన్ లోను ఆది బిగ్ బాస్ స్టేజ్ పై చేసిన కామెడీ అదుర్స్, హౌస్ మేట్స్ తీరును వర్ణించిన తీరు అద్భుతం.

అందుకే ఈ సీజన్ లో దివాళి ఈవెంట్ కి ఆది ని తీసుకొచ్చారు. నాగార్జున పక్కనే ఆది నిలబడి హౌస్ మేట్స్ గురించి ఫన్నీగా చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది. రావడం రావడమే క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చిన ఆది ఇక్కడ ఎవరైనా సిక్సర్ కొట్టారు అంటే ఆది తేజనే. వాడు వేసిన సిల్లీ నామినేషన్స్ కి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు, విచిత్రమేమిటంటే ఆ సిల్లీ రీజన్ తోనే తేజని బయటికి పంపించావ్ అంటూ శివాజీకి చెప్పాడు. ఇక నాగార్జున గారికి మన్మధుడు సినిమాలో ఫస్ట్ హాఫ్ లో అమ్మాయిలంటే పడదు ఈ సీజన్ లోను ఫస్ట్ హాఫ్ లో అమ్మాయిలని వరసగా ఎలిమినేట్ చేసారు అంటూ కామెడీ చేసాడు.

ఇక టాస్క్ లు పెట్టే బిగ్ బాస్ కే నువ్వు పెద్ద టాస్క్ అయ్యావ్, ఏ టాస్క్ పెట్టాలా అని నీ హిట్ చూసి బిగ్ బాస్ కూడా ఆలోచిస్తున్నాడు అంటూ అర్జున్ అంబటిపై సెటైర్ వేసాడు. నువ్వు శోభని కెప్టెన్ చెయ్యడానికి కష్టపడ్డావ్ కానీ నీ కోసం మాత్రం కష్టపడవంటూ అమర్ గురించి చెప్పాడు. ఇక యావర్ తెలుగు విషయంలో ఫన్నీగా మాట్లాడు. తేజ నిద్రలోను శోభా టాటూ గురించే ఆలోచిస్తున్నాడు, టాటూ వద్దు నాకు ఓటు వద్దు అంటూ పలవరిస్తున్నాడు. ఇక మొదటి వారం రతిక మాయలో పడి చెట్టు గురించి పట్టించుకోలేదు. తర్వాత రతిక అన్నా అంటే నువ్వెక్కడ పిచ్చోడివైపోతావో అని భయపడ్డామంటూ పల్లవి ప్రశాంత్ పై హైపర్ ఆది కామెడీ చేసిన ప్రోమో వైరల్ గా మారింది. 

Hyper Aadi at Bigg Boss 7 stage:

Bigg Boss Telugu 7: Today Diwali promo viral

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ