Advertisementt

రేవ్ పార్టీలో దొరికిపోయిన బిగ్ బాస్ ఫేమ్

Sun 12th Nov 2023 03:54 PM
bigg boss  రేవ్ పార్టీలో దొరికిపోయిన బిగ్ బాస్ ఫేమ్
Bigg Boss fame caught in rave party రేవ్ పార్టీలో దొరికిపోయిన బిగ్ బాస్ ఫేమ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లోకి వెళ్లకముందే వెండితెర మీద హీరోయిన్స్ కి ఫ్రెండ్ కేరెక్టర్స్ లో కనిపించిన హిమజ.. బిగ్ బాస్ కి వెళ్లి ఫేమస్ అవుదామనుకుంటే ఆమెని రెండుమూడు వారాల్లోనే ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. తర్వాత యూట్యూబ్ ఛానల్ తో హడావిడి చేస్తున్న హిమజ తనకి సంబందించిన ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా వాటిని యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసే సరికి ఆమె కి ఇంత సంపాదన ఎక్కడిది, ఏమి చెయ్యకుండానే ఇంత కాస్ట్లీ కారు, ఇల్లు ఎలా కొనుక్కుందో అంటూ చాలామంది నెటిజెన్స్ ఆమెని ట్రోల్ చేసేవారు. దానికి నా డబ్బు నా ఇష్టం నేను కష్టపడుతున్నాను, కొనుక్కుంటాను అంటూ కాస్త హార్ష్ గానే సమాధానమిచ్చేది.

అయితే హిమజ ఇప్పుడు ఓ రేవ్ పార్టీలో దొరికిపోవడమే కాదు.. ఆ పార్టీని హిమాజే ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు చెప్పడం మరింత షాకిచ్చే విషయం. హైదరాబాద్ నగర శివార్లలోని ఇబ్రహీం పట్నంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలిసుల దాడి, రేవ్ పార్టీ భగ్నం, ఇది బిగ్ బాస్ ఫేమ్ హిమజ అద్వర్యం లో జరిగిన పార్టీ అంటూ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

హిమజతో పాటుగా ఈ పార్టీలో పాలొన్న మరో 11 మంది సినీ ప్రముఖులు, బిగ్ బాస్ స్టార్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఈకేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అంటూ మీడియాలో కనిపించిన వార్తతో హిమజ అభిమానులు షాకవుతున్నారు.

Bigg Boss fame caught in rave party:

Bigg Boss fame Himaja caught in rave party

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ