ఈరోజు ఆదివారం.. మామూలుగానే నాగార్జున హోస్ట్ గా హౌస్ మేట్స్ అంతా రంగురంగుల బట్టలు వేసుకుని డాన్స్ లు, ఆటలు, పాటలు అంటూ హౌస్ మొత్తం సందడిగానే కనబడుతుంది. మరి ఆదివారానికి తోడు దివాళి కూడా యాడ్ అయితే ఇందుకేముంది.. మరింత సందడి పెరుగుతుంది. మరి దివాళి ఈవెంట్ ఈరోజు కూడా ఎప్పటిలాగే బిగ్ బాస్ యాజమాన్యం అద్భుతంగా ప్లాన్ చేసింది. హీరోయిన్స్ డాన్స్ లు, సినిమా ప్రమోషన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ మొత్తం సందడిగా మారిపోయింది. ఆదికేశవ టీమ్ లో శ్రీలీల ఈ ఈవెంట్ కి హైలెట్ గా కనిపించింది.
ఇక గత వారం ఫ్యామిలీ వీక్ అంటూ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ని ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపించిన నాగార్జున ఈ వారం అంటే ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పైకి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా ఫ్రెండ్ ని తీసుకొచ్చారు. హౌస్ లోని వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ స్టేజ్ సందడిగా మారిపోగా.. శివాజీ కొడుకు హౌస్ లోని వారిని సరదాగా ఆటపట్టించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇక సయ్యద్ సోహెల్ మరోసారి తన ఫ్రెండ్ కోసం స్టేజ్ పై కనబడుతూ.. నాలుగో సీజన్ నుంచి ప్రతి సీజన్ కి వస్తూనే ఉన్నాను అనగానే నాగార్జున అవును సూటు కేసు పట్టుకుపోయి రాకేమి చేస్తావ్ అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు అంబటి అర్జున్ నువ్వు రామ్ చరణ్ గారి మూవీలో నటిస్తున్నావ్ అంటూ వరమిచ్చాడు.. థాంక్యూ బుచ్చన్నా అంటూ అర్జున్ థాంక్స్ చెప్పాడు. ఇక కమెడియన్ ఇమ్మాన్యువల్ యావర్ కోసం రాగా.. అమరదీప్ కోసం ఆయన తల్లి వచ్చారు. అర్జున్ కోసం అలాగే అమరదీప్ కోసం వాళ్ళ ఫ్రెండ్ మానస్ వచ్చాడు. శివాజీ వైఫ్ చిన్న కుమారుడితో కలిసి సందడి చేసారు. ఇలా దివాళి ఈవెంట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఫ్యామిలీ-ఫ్రెండ్ అలాగే సినిమా ప్రమోషన్స్, స్పెషల్ డాన్స్ లతో హోరెత్తిపోయింది.