బిగ్ బాస్ సీజన్ 7 లో నటుడు శివాజీ అపర చాణుక్యుడిగా అట ఆడుతున్నాడు. శివాజీకి కొంతమంది ఫేవర్ గా ఉంటే.. కొంతమంది మాత్రం చాలా కోపంగా ఉన్నారు. శివాజీ కూడా తన చుట్టూ కొంతమందిని పెట్టుకుని బ్యాచ్ నడుపుతున్నాడు. తానేమి ఒక్కరిని ఒక్క మాట అనను, అందరూ నా బిడ్డలే అని చెప్పుకుంటూ ఉండే శివాజీ నామినేషన్ వేస్తె మాత్రం తీసుకోలేడు. వారి మీద కోపం తెచ్చేసుకుంటాడు. అలాగే సీరియల్ బ్యాచ్ గా కనిపించే శోభా శెట్టి, ప్రియాంక, అమరదీప్ అంటే శివాజీ పడదు. వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తాడు.
అది బయటికి చూపించకుండా అప్పుడప్పుడు తనలో తానే మాట్లాడుకుంటాడు. శోభా శెట్టి కెప్టెన్ అయ్యాక శివాజీ వాళ్లపై మరింత విషం చిమ్ముతున్నాడనే వాదన మరింతగా ఎక్కువైంది. గత వారం నామినేషన్స్ లో అమరదీప్, శోభా, ప్రియాంక, తేజ ఉన్నారు. వాళ్లలో ఎవరో ఒకరి ఎలిమినేట్ అవ్వాలని శివాజీ అనుకున్నాడు. ఈ వారం ఎవ్వరూ నామినేషన్స్ లో లేరు. నాకు దొరక్కపోరా అంటూ మాటిమాటికి అంటున్నాడు. అయితే బయటికి కనిపించకుండా విషం చిమ్మే శివాజీ ముసుగుని నాగార్జున తీసేసారు. గత రాత్రి ఎపిసోడ్ లో శివాజీ వీడియో ఒకటి వేసి చూపించారు. దానితో శివాజీ రాజమాతలపై విషం చిమ్ముతూ మాట్లాడిన మాటలకి అందరూ షాకయ్యారు. కానీ నేను సరదాగా అన్నాను అంటూ కవర్ చేసుకున్నాడు.
ఇక ఈ వారం కెప్టెన్ గా యునానమస్ గా శివాజీని ఎన్నుకుంది హౌస్. హౌస్ మేట్స్ మొత్తం శివాజీ కెప్టెన్సీ చూడాలని ఉంది అన్నారు. నాగార్జున శివాజీ కెప్టెన్ అని చెప్పగానే ఆయన దోస్త్ లు పల్లవి ప్రశాంత్, యావర్ లతో కలిసి లాన్ లో డాన్స్ వేసాడు. ఇక శివాజీ కొన్నాళ్లుగా పెట్టుకున్న పగని నాగార్జున వీడియో రూపంలో రివీల్ చేసేసారు. దానితో శివాజీపై బయట ఎంతోకొంత నెగిటివి అయితే తప్పేలా లేదు.