నాని ఇప్పుడు ప్యాన్ ఇండియా హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. దసరాతో మాస్ గా ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరవుదామనుకున్నాడు. కానీ దసరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయ్యింది.. మిగతా లాంగ్వేజెస్ లో దసరా ఎవ్వరికి దక్కలేదు. దసరా ని కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లో బాగానే ప్రమోట్ చేసాడు. కానీ అది ప్యాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈసారి అలా జరక్కూడదు అని నాని గట్టిగా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది.
ఎందుకంటే డిసెంబర్ 7న హాయ్ నాన్న అంటూ రిలీజ్ డేట్ ఇవ్వకముందు నుంచే నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. ముందు డిసెంబర్ 21 సినిమా విడుదల అన్నప్పటికీ.. ఆ తేదీకి సలార్ రావడంతో నాని ఇంకాస్త ముందుకు వచ్చేసి డిసెంబర్ 7 న సినిమా ని రిలీజ్ చేస్తున్నాడు . మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
బాలీవుడ్ షోస్ లో కనిపించడం, సౌత్ లో హాయ్ నాన్న విడుదలవుతున్న ప్రతి భాషలోనూ సినిమాని ప్రమోట్ చెయ్యడమే కాదు.. తెలుగులో నాని సినిమాలని ప్రమోట్ చేసే ఏ ప్లాట్ ఫామ్ కూడా వదలడం లేదు. ప్రతిదీ నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ కి వాడేస్తున్నాడు. సినిమా విడుదలకు ఇంకా నెల ఉంది. కానీ నాని కూల్ గా నెల ముందు నుంచే సినిమాని ప్రేక్షకులోకి తీసుకువెళుతున్నాడు. ఇక ఎక్కడ చూసినా నానినే కనిపించడంతో ఏంటి నాని గారు ఈ స్పీడు అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.