విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మొదలైన లైగర్ మూవీ లోకి ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ని తీసుకున్నారు. అనన్య పాండే సినిమాకి హెల్ప్ అవ్వకపోగా.. ఆమె లుక్స్ పై బోలెడన్ని విమర్శలొచ్చాయి. లైగర్ డిసాస్టర్ కి ప్రధాన కారణం అనన్య పాండే అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఆ చిత్రం తర్వాత అనన్య మళ్ళీ తెలుగులో కనిపించలేదు. అయితే లైగర్ డిసాస్టర్ విషయంలో అనన్య పాండే ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చెయ్యకుండా కామ్ గానే ఉంది.
కానీ ఫస్ట్ టైమ్ అనన్య పాండే లైగర్ ప్లాప్ పై సన్సేషనల్ కామెంట్స్ చేసింది. లైగర్ లో తాను నటించడం తన జీవితంలోనే అతి పెద్ద తప్పిదమని, ఆ సినిమాలో నటించేలా అందరూ ఒప్పించారు. తన తండ్రి చుంకీపాండే, తల్లి భావన, నిర్మాత కరణ్ జొహార్ బలవంతంతోనే తాను ఈ చిత్రంలో నటించానని, ఈ సినిమాకు వచ్చినంత చెత్త రివ్యూ నా కెరీర్ లో, లైఫ్ లో ఏ సినిమాకు రాలేదు అంటూ అనన్య పాండే లైగర్ మూవీపై సన్సేషనల్ గా మాట్లాడింది.
అటు విజయ్ కి ఇటు పూరీని లైగర్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పుడు అనన్య పాండే కూడా లైగర్ డిసాస్టర్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని డిస్పాయింట్ చేసింది.