మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు లో తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయన తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో ఆయన కనిపించినా పెద్దగా హడావుడి చెయ్యలేదు. రీసెంట్ గా తమ్ముడు కొడుకు వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి సందడి చేసిన ఆయన ఎయిర్ పోర్ట్ లో హుషారుగా కనిపించారు.. ఇకపై వసిష్ఠ తో చెయ్యబోయే విశ్వంభర సెట్స్ లోకి వెళ్ళిపోతారు.. గత నెలలో మొదలైన విశ్వంభర మూవీ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది అనే ప్రచారం జరిగింది.
అయితే నవంబర్ 22 నుంచి వసిష్ఠ విశ్వంభర మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారట. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళినా.. చిరు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారట. దర్శకుడు వసిష్ఠ చిరు లేకుండా కొన్ని ఫారెస్ట్ సీన్స్ ని చిత్రీకరించబోతున్నారట. డిసెంబర్ లేదా జనవరి నుండి మెగాస్టార్ చిరు విశ్వంభర షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.
ఆయన మోకాలి ఆపరేషన్ వలన ప్రోపర్ రెస్ట్ అవసరమవడంతోనే తొందరపడి షూటింగ్ చేసి, కాలు కదిలితే మళ్ళీ ప్రోబ్లెం అవుతుంది అని చిరు ఈ నిర్ణయం ఈ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం మెగాస్టార్ మరికొద్దిరోజుల్లో షూటింగ్స్ కి వెళ్లకుండా రెస్ట్ తీసుకుంటారని సమాచారం.