బిగ్ బాస్ సీజన్ 7 లో ఇప్పటివరకు10 వారాలు పూర్తయ్యాయి. పదకొండో వారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ గా హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి వెళ్లారు. గత నాలుగు రోజులుగా హౌస్ మొత్తం ఎమోషనల్ మూమెంట్స్ తో నిండిపోయింది. గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శివాజీకి గౌతమ్ కి మధ్యన కొట్టుకునే సిట్యువేషన్ వచ్చింది. గౌతమ్ ఎప్పటిలాగే శివాజీపై అలిగేషన్ వేస్తూ రెచ్చిపోయాడు. శివాజీ కూడా ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాత అమర్ కి యావర్ కి మధ్యలోఫైట్ అయ్యింది.
అదలా ఉంటే ఈరోజు హౌస్ కి శోభా తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారో అనేది నాగార్జున ఫైనల్ చెయ్యబోతున్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున రాగానే అర్జున్ ని శోభా శెట్టి కెప్టెన్సీ ఎలా ఉంది అని ప్రశ్నించారు హౌస్ లో శోభా కెప్టెన్సీపై శివాజీ-అర్జున్ పదే పదే మాట్లాడుకోవడంతో ముందుగా నాగ్ అర్జున్ నే అడిగారు. శోభా శెట్టి ఏసీ రూమ్ లో ఎంజాయ్ చెయ్యడమే సరిపోయింది అంటూ అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ పై హౌస్ మేట్స్ అభిప్రాయాలూ చెప్పమన్నారు నాగ్. చాలామంది శివాజీ కెప్టెన్సీ చూడాలని ఉంది అన్నారు.
ఆ తర్వాత రాజమాతలుగా మీరు అందరికి న్యాయం చేసారా అని నాలుగు అమ్మాయిలని అడిగారు. అశ్విని మాత్రం ప్రియాంక, శోభా శెట్టి డామినేట్ చేసారు అంది. భోలే కూడా వారిద్దరూ దబాయించినట్టుగా కనిపించింది అని చెప్పాడు. అమర్ ని పిలిచి ముగ్గురు నిన్ను నామినేషన్స్ లోకి రాకుండా కాపాడారు అన్నారు. తర్వాత శోభా శెట్టి, ప్రియాంకలని అదే ప్రశ్న వేశారు. గౌతమ్ కూడా మూడుసార్లు అమర్ పేరు వచ్చినా అతన్ని నామినేషన్స్ లో నిలపలేదు అన్నాడు. నాగార్జున చివరిగా బయాసిడ్ గా పార్షియల్ గా అనిపించింది అంటూ శోభా శెట్టి, ప్రియాంకలకి క్లాస్ పీకినట్టుగా వచ్చిన ప్రోమో వైరల్ గా మారింది.