Advertisement
TDP Ads

ఈ ఫ్లిప్పులేంటమ్మా.. షర్మిలమ్మా

Sat 11th Nov 2023 09:59 AM
kcr  ఈ ఫ్లిప్పులేంటమ్మా.. షర్మిలమ్మా
Competition against Revanth Reddy.. ఈ ఫ్లిప్పులేంటమ్మా.. షర్మిలమ్మా
Advertisement

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొద్ది రోజుల కిందట ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక విషయం మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ‘ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకు అంటారు? ఆడపిల్ల కాబట్టి..’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు షర్మిల ఎందుకోగానీ బాగా ఫ్లిప్ అవుతున్నారు. షర్మిల చేస్తున్న కామెంట్స్.. అన్నీ ఊహాతీతంగా ఉన్నాయి. పార్టీ పెట్టడం.. పాదయాత్ర చేయడం.. ధర్నాలు, ర్యాలీలు.. దీక్షలు.. ఇన్ని చేసి చివరకు పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతామంటూ చర్చలు జరిపారు. పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆలోచనను విరమించుకున్నారు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు.

రేవంత్‌ ఓ దొంగ..

అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు సైతం షర్మిల ఆహ్వానించారు. చివరకు ఏమైందో ఏమో కానీ తూచ్.. మేము పోటీ చేయడం లేదు. కాంగ్రెస్‌కు మద్దతిస్తాం. మా అంతిమ లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడమే. మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఓట్లు చీలి కేసీఆర్‌కు లాభం చేకూరుతుంది కాబట్టి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాంగ్రెస్‌కు మా ఫుల్ సపోర్ట్ అని చెప్పి.. చివరకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని మాత్రం షర్మిల ఏకిపారేశారు. రేవంత్‌ ఓ దొంగ అని.. ఆయన ఎలా సీఎం అవుతారు అంటూ నానా యాగీ చేశారు. అయితే వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా రేవంతే అడ్డుకున్నారని టాక్ ఉంది.

రేవంత్ రెడ్డిపై పోటీ..

నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ, సీపీఐ, సీపీఎంలు పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ బాగా హైలైట్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తిరిగి ఆంధ్రోళ్ల పాలన కింద బతకాల్సి వస్తుందంటూ రెచ్చగొట్టారు. కేవలం ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టి గులాబీ బాస్ కేసీఆర్ విజయం సాధించారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు షర్మిల పార్టీ విలీనాన్ని సైతం రేవంత్ అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ కోపంతోనే షర్మిల రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారులే అనుకున్నారంతా. కానీ షర్మిల అంతటితో ఆగలేదు. రేవంత్‌కి పోటీగా తన అనుచరుడు సుధాకర్‌ను కామారెడ్డి నుంచి బరిలోకి దింపారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ మళ్లీ సుధాకర్‌ను పిలిచి పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. తప్పుకున్న సుధాకర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. షర్మిల ఇలా మాటిమాటికీ ఫ్లిప్ అవుతుండటంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Competition against Revanth Reddy..:

KCR has highlighted it well

Tags:   KCR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement