బిగ్ బాస్ సీజన్ 7 లో పది వారాల పాటు కామెడీ చేసుకుంటూ శోభా శెట్టి తో ఫ్రెండ్ షిప్ చేస్తూ నెట్టుకొచ్చేసిన టేస్టీ తేజ వలన హౌస్ నుంచి వరసగా ఐదుగురు ఎలిమినేట్ అవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తేజది ఐరెన్ లెగ్, అతని నామినేషన్స్ వలన చాలామందే ఎలిమినేట్ అయ్యారంటూ బయట పెద్ద రచ్చే జరిగింది. ఇక హౌస్ లో ఉండాలా.. అమ్మని ఫ్యామిలీ వీక్ లో తీసుకురావాలా అంటూ చెప్పిన మరుసటి రోజే తేజ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు.
అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఎవ్వరైనా యూట్యూబ్ ఇంటర్వ్యూ, బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తప్ప ఇంకెక్కడా కనిపించరు. మళ్ళీ ఫైనల్ వీక్ లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనబడతారు. అంతే తప్ప పెద్దగా హడావిడి చేస్తూ షూటింగ్స్ తో బిజీ అయ్యే సందర్భాలు ఇప్పటివరకు కనిపించలేదు. కానీ టేస్టీ తేజ గత ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు.. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి తన కెరీర్ లో బిజీ అయ్యాడు. అంటే టేస్టీ తేజ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ షో కి వెళ్ళాడు.
అంతేకాదండోయ్ హాయ్ నాన్నా హీరో నాని తో కలిసి లంచ్ చేసాడు. అంటే టేస్టీ తేజ కుకింగ్ వీడియోస్ తో ఫేమస్ అయ్యాడు. అలా హాయ్ నాన్న ప్రమోషన్స్ కి టేస్టీ తేజని తీసుకొచ్చారు. నాని తో కలిసి లంచ్ చేస్తూ ఫన్నీగా నాని సినిమాని ప్రమోట్ చేసుకోవడం చూస్తే తేజ లక్కీ అనే చెప్పాలి. ఎలిమినేట్ అయ్యి ఇంట్లోనే కూర్చోకుండా ఇలా బిజీగా కనిపించడం అంటే లక్కీనే కదా.