మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి బ్యాక్రౌండ్ గురించి ఎవరికీ పెద్గగా తెలియదు. హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో నవంబర్ 1 న ఇటలీ వేదికగా పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి అఫీషియల్ గా కోడలిగా అడుగుపెట్టింది. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కామినేని వారి అమ్మాయి. వారి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియని వారుండరు. కానీ లావణ్య త్రిపాఠి ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే దానిమీద చాలా ఆసక్తి ఉంది.
నాగబాబు తనకి కాబోయే కోడలు ఎలా ఉండాలనుకున్నారో ఆమె బ్యాక్ గ్రౌండ్ అలానే ఉంది. లావణ్య త్రిపాఠి అయోధ్యలో పుట్టి స్కూల్ డేస్ మొత్తం డెహ్రాడూన్ లో జరిగిందట. ఆమె తండ్రి సివిల్ కోర్టు జెడ్జ్ కావడంతో తరచూ ఆమె ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ పేరుతొ పలు సిటీస్ కి వెళ్ళేది. అలా లావణ్య త్రిపాఠి కాలేజ్ డేస్ ముంబైలో నడిచాయట. ఇక ఆమె చెల్లి ఓ ఐపీఎస్ ఆఫీసర్ కాగా.. తమ్ముడు కూడా అడ్వకేట్ జెడ్జ్ అని తెలుస్తుంది. లావణ్య త్రిపాఠి తల్లి ఓ టీచర్. అంటే లావణ్య ఫ్యామిలీ ఫుల్లీ ఎడ్యూకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట.
ఇక వారంతా ఎవరి ప్రొఫెషన్ లో వారు స్థిరపడగా.. లావణ్య త్రిపాఠి మాత్రం ఆ కుటుంభంలో యూనిక్ అంట. ఆమె ఎవ్వరూ చెయ్యని, లేని ఫీల్డ్ ని ఎంచుకుని సినిమా రంగంలో స్థిరపడినట్లుగా తెలుస్తుంది. ఇదన్నమాట మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం.