కోలీవుడ్ హీరో సిద్దార్థ్ కి తమిళం లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. అందుకే తమిళంలో తాను చేసిన సినిమా హిట్ అవడంతో దానిని తెలుగులో చిన్నా టైటిల్ తో డబ్ చేసి విడుదల చేసాడు. అయితే చిన్నా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ఇక్కడ పెద్ద బ్యానర్ నుంచి ఆ సినిమాని సిద్దార్థ్ విడుదల చేసాడు. అయితే రాంగ్ టైమ్ లో విడుదల చెయ్యడంతో చిన్నాని థియేటర్స్ లో ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. కంటెంట్ ఉన్నా కనెక్ట్ అయ్యే సినిమా అయినప్పటికీ.. ప్రమోషన్స్ వీక్ గా ఉండడం, డబ్బింగ్ మూవీ కావడంతో థియేటర్స్ లోకి వచ్చిన విషయం పెద్దగా ఎవ్వరికి రీచ్ అవ్వలేదు.
చిన్నా మూవీ ఓటిటి విడుదల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా వెయిట్ చేస్తున్నారు. తెలుగులోను విమర్శకులకు సైతం మెప్పించిన ఈ సినిమాని ఓటిటిలో వీక్షించేందుకు కుటుంభ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిన్నా మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కి విడుదలకు రెడీ అయ్యింది. అక్టోబర్ 6 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని నవంబర్ 17 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ నుంచి చిన్నా మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.