బిగ్ బాస్ సీజన్ 7 లో ఈరోజుతో అంటే శుక్రవారంతో ఫ్యామిలీ వీక్ ముగిసినది. ఈ రోజు ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ తండ్రి, రతిక తండ్రీలు వచ్చారు. కాసేపు ఎమోషనల్ గా మారిన హౌస్ ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ విషయంలో గందరగోళంగా మారిపోయింది. పదో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఓ బేబీ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో బేబీ కేర్ జోన్ లోకి వెళ్లకుండా గేట్ దగ్గరే చివరిగా ఎవరి బొమ్మ ఆగిపోతుందో వారు ముందుగా ఎలిమినేట్ అవుతారని అన్నారు. ఆ తర్వాత అమర్ ఒకరి పేరున్న డాల్ పట్టుకుని బేబీ కేర్ జోన్ లోకి వెళ్లకుండా ఉండిపోయాడు. గౌతమ్ నా చేతిలో ఉన్న బొమ్మ లాక్కెళ్లిపోయాడంటూ అమర్ కంప్లైంట్ చేసాడు.
ఆతర్వాత యావర్ కి అమరదీప్ కి మధ్యన మొదలైన గొడవ.. గౌతమ్-శివాజీలవైపు తిరిగింది. గౌతమ్ కి శివాజీకి మధ్యన నాన్ స్టాప్ గా గొడవ జరిగింది. నీకు చాలాసార్లు చెప్పాను ఊరికే గొడవ పెట్టుకుంటే ఎవ్వరూ యాక్సప్ట్ చేయరు అన్నాడు శివాజీ. దానికి గౌతమ్ నాకు అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకోను అన్నా అన్నాడు. అంటే నువ్వు ఆడియన్స్ అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నావ్ అంటూ శివాజీ అనేసరికి గౌతమ్ శివాజీ మీదకి దూసుకెళ్లాడు. నేను అరుస్తా అన్నా అన్నాడు గౌతమ్. దానికి శివాజీ ఫైర్ అవుతూ నేను అరవలెనా అన్నాడు.
పద్దాక మీరే మాట్లాడుతున్నారు. మీరు సెకండ్ బిగ్ బాస్ అనుకున్నారా అన్నాడు గౌతమ్. ఇంతకుముందు అలానే అన్నావ్ నాగ్ సర్ తో ఏమైందో చూసావ్ గా అన్నాడు శివాజీ. తిట్టనియ్ అన్నా తిట్టని నా ఇష్టం అంటూ గౌతమ్ తెగ రెచ్చిపోయాడు. నా యాటిట్యూడ్ ఇంతే అన్నాడు గౌతమ్. నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నావ్ అనగానే గౌతమ్ రెచ్చిపోయి మైక్ తీసి పడేసి నన్ను పంపించేయ్యండి బిగ్ బాస్ అంటూ గేట్స్ ని బడుతున్న ప్రోమో వైరల్ గా మారింది.