బిగ్ బాస్ సీజన్ 7 లోకి సామాన్యుడిగా రైతు బిడ్దగా అడుగుపెట్టి ఈ రోజు టైటిల్ ఫెవరెట్ గా మారిన పల్లవి ప్రశాంత్ అసలు హౌస్ లో జన్యున్ గా ఉంటున్నాడా లేదంటే నటిస్తున్నాడా అనే విషయంలో బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంటుంది. మొదట్లో ఏడుస్తూ సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత ఆటలో స్ట్రాంగ్ గా మారాడు. ఇప్పటికే నటులని వెనక్కి నెట్టి ఓ రైతు బిడ్డ టైటిల్ కి చేరువయ్యాడనే మాట పలువురు నోళ్ళలో వినిపిస్తుంది.
ఇక ఫ్యామిలీ వీక్ లో పల్లవి ప్రశాంత్ తండ్రి రాగానే కాళ్ళ మీద పడిపోయి ఏడుపు స్టార్ట్ చేసాడు. తండ్రికి ముద్దుగా గోరుముద్దలు తినిపిస్తూ అందరి అటెన్షన్ తన మీద పడేలా చేసుకున్నాడు. దానితో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపించాడు. శివాజీ కి సేవ చేస్తూ శివాజీ బ్యాచ్ గా కనిపించిన అతన్ని వీడేమిటి వీడి ఓవరేక్షన్ ఏమిటి అంటూ హేట్ చేసినవారే ఈరోజు అతని గ్రాఫ్, అతని క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ ఈసారి టైటిల్ ఎగరేసుకుపోతాడని సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ అయ్యింది.
నామినేషన్స్ అప్పుడు అతను చేసే అతి తప్ప మిగతా విషయాల్లో అన్నీ ఓకె, ఆ నామినేషన్స్ విషయంలో రైతు బిడ్డగా సింపతీ పోగెసుకున్న పల్లవి ప్రశాంత్ ముసుగు తొలిగిపోతుంది. నాగాంచిలా ఉంటూ పాతుకుపోయాడంటూ అర్జున్ అంబటి అర్జున్ చెప్పినట్టుగా పల్లవి ప్రశాంత్ కప్పు పట్టుకెళ్లినా హౌస్ మేట్స్ చూస్తూ ఊరుకోవడం తప్ప ఇంకేమి చెయ్యలేరు అంటున్నారు.