సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చేలా చేసిన పూష ద రైజ్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ద రూల్ మూవీపై ప్యాన్ ఇండియా మార్కెట్ లో భారీగా అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 విషయంలో చాలా సిన్సియర్ గా అంటే పుష్ప కి మించి కష్టపడుతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. అటు నేషనల్ అవార్డు విన్ అయ్యి అందరి అటెన్షన్ తన మీద పడేలా అడుగులు వేసాడు.
ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న పుష్ప పార్ట్ 2 షూటింగ్ పై ఇప్పుడొక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వదిలిన లుక్ తోనే అతి కీలకమైన జాతర సీక్వెన్స్ చిత్రీకరించారట సుకుమార్. ఈ జాతర సీక్వెన్స్ సినిమా మొత్తంలో గూస్ బంప్స్ తెప్పించేదిలా ఉండబోతున్నాయట. పుష్ప తో పోలిస్తే పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ ఇంకాస్త ఎక్కువ కష్టపడి మెప్పించబోతున్నాడంటూ చేసిన ట్వీట్స్ అల్లు అర్జున్ ఫాన్స్ ని మేఘాల్లో తేలేలా చేస్తున్నాయి.
ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక ఎత్తు.. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పుష్ప 2 పై అంచనాలు మరో ఎత్తు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.