బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో ఎమోషనల్ గా ఫీలవుతున్న బుల్లితెర ప్రేక్షకులు కంటెస్టెంట్స్ బిహేవియర్ పై స్పష్టత తెచ్చుకుంటున్నారు.. శివాజీ కొడుకు, అశ్విని తల్లి, అర్జున్ భార్య, గౌతమ్ తల్లి, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ, శోభా శెట్టి తల్లి, అమరదీప్ భార్య, భోలే భార్య, ప్రిన్స్ అన్న ఇలా హౌస్ మేట్స్ కుటుంభ సభ్యులు హౌస్ లోకి రావడం హౌస్ మేట్స్ తో కనెక్ట్ అవడం చూసాం. ఇక ఈరోజు పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. రతిక ఇంటి సభ్యులు ఎవరు వస్తున్నారో తెలియాల్సి ఉంది.
అయితే ఉల్టా పూల్టా లో భాగంలో అసలు ఎవరు టాప్ 5 లో ఉంటారో బుల్లితెర ప్రేక్షకులు అంచనాకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ లోకి వెళ్లే సభ్యులపై ఆల్మోస్ట్ ఓ క్లారిటీ కి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్, బోలే షవాలి, రతికా రోజ్ లలో బోలే కానీ, రతిక కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి.
ఇక టాప్ 5 లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజీ, అర్జున్ అంబటి, అమరదీప్, ప్రియాంక ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలైతే అమరదీప్ ప్లేస్ లో యావర్ ఉండాల్సింది. కానీ యావర్ గ్రాఫ్ మూడు వారాలుగా పడిపోతుంది. ఇక టాప్ 1 లో పల్లవి ప్రశాంత్ కి బయట బాగా స్ట్రాంగ్ క్రేజ్ ఉంది. మరోపక్క శివాజీ సెటిల్డ్ గా ఆడుతున్నాడు. ఇక మొదటి తొమ్మిది వారాల్లో చేతగాని వాడిలా ప్రొజెక్ట్ అయిన అమరదీప్ ఇప్పుడు గ్రాఫ్ పెంచుకుని 4th పొజిషన్ కి వచ్చాడు. ఒక నెల లేట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అర్జున్ మూడో పొజిషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సీలి రాకాసి ప్రియాంక జైన్ 5th పొజిషన్ లో కొనసాగుతుంది. మిగతా ఆరుగురు వచ్చే వారాల్లో ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది.. అయినా ఉల్టా పూల్టా లో ఏం జరగబోతుందో చూడాలి.