రామ్ చరణ్ నిజంగానే వెనక్కి తగ్గుతున్నాడా.. ఇదే కనిపిస్తుంది సోషల్ మీడియాలో.. ఈ దీపావళి సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అంటూ మేకర్స్ గొప్పగా దసరా కే ప్రకటించారు. జరగనిది పాట ఈ దివాళికి బ్లాస్ట్ అంటూ నిన్నమొన్నటివరకు చెప్పారు. కానీ ఇప్పుడు దివాళికి గేమ్ చెంజర్ సాంగ్ రాకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. పండక్కి ఇంకా రెండే రోజులు ఉన్నా ఇప్పటివరకు ప్రోమో వదల్లేదు.
ఇక్కడే అర్ధమవుతుంది.. గేమ్ చెంజర్ సాంగ్ దివాళికి రాదని అంటూ ట్వీట్లు వేస్తున్నారు. దానితో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. అసలే అప్డేట్ లేక మెగా అభిమానులు ఆవురావురుమంటున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ చెంజర్ ఫస్ట్ సాంగ్ అనగానే వారు చాలా ఎగ్జైట్ అయ్యారు. మేకర్స్ మొదటిసారి ఇచ్చిన అప్డేట్ తో కూల్ అయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే దివాళికి ఈ పాత ఉండకపోవచ్చేమో అంటున్నారు.
మరి ఇది నిజమా, కాదా అనేది మేకర్స్ చెబితే ఓకె.. లేదంటే మరో రెండు రోజుల్లో రాబోయే ఈ పాట కోసం చాలా ఆతృతగా ఉన్నారు. శంకర్ ఈ పాటకి ఎంత ఖర్చు పెట్టారో అనేది విజువల్స్ రూపంలో చూడాలని మరికొందరు వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ పాట పోస్ట్ పోన్ అయితే చాలామంది డిస్పాయింట్ అయ్యేలా ఉన్నారు.