యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ నిన్నమొన్నటివరకు హైదరాబాద్ కే పరిమితమైంది. మొన్ననే గోవా షెడ్యూల్ కోసం హైదరాబాద్ ని విడిచివెళ్ళింది యూనిట్. ప్యాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి దేవర కోసం ఎక్కువగా బాలీవుడ్ నటులని కొరటాల ఈ చిత్రం కోసం ఎంపిక చేసారు. ముఖ్యంగా విలన్ పాత్ర కోసం, హీరోయిన్ పాత్ర కోసం నార్త్ నటులని తీసుకొచ్చి అక్కడి ప్రేక్షకుల్లో దేవర మీద అటెన్షన్ క్రియేట్ చేసారు.
మరి సినిమా నార్త్ లో గట్టిగా ఆడాలంటే ఇది సరిపోతుందా.. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ వెనుక అప్పుడు రాజమౌళి ఉన్నారు. ఆయన బ్రాండ్ నార్త్ లో ఆర్.ఆర్.ఆర్ విజయానికి దోహదపడింది. మరి దేవర పరిస్థితి ఏమిటి. ఎన్టీఆర్ కి నార్త్ లో గ్రిప్ ఉందా.. కొరటాల చూస్తే డిసాస్టర్ తో సతమతమయ్యాడు. ఆయన్ని నార్త్ ఆడియన్స్ ఎంతవరకు నమ్ముతారు. జాన్వీ కపూర్ హిందీలో క్రేజీ హీరోయిన్ కాదు, అటు సైఫ్ అలీఖాన్ కూడా అంతే. మరి ఇది నార్త్ కి ఎక్కుతుందా..
అందుకే ఎన్టీఆర్ దేవర షూటింగ్ కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లి వస్తుంటే అక్కడి ఆడియన్స్ లో కాస్త ఇంట్రెస్ట్ పుడుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వేరే విషయాలపై కూడా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే దేవరకి హెల్ప్ అవుతుంది. అల్లు అర్జున్ చూడండి పుష్ప సినిమా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు ముంబై వెళ్ళివచ్చాడు. అక్కడి ప్రముఖులతో మీటింగ్స్, ముంబై లో భార్య తో లంచ్ డేట్ ఇలా నార్త్ ఆడియన్స్, మీడియా అటెన్షన్ తనవైపు పడేలా చూసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తే బావుంటుంది అనేది ఆయన అభిమానుల కోరిక. అందుకే దేవర అప్పుడప్పుడు ముంబైని టచ్ చెయ్ అంటూ కామెంట్స్ పెడుతూ ఆయనకి రిక్వెస్ట్ లు పంపుతున్నారు.