పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎలా ఉన్నా రాజకీయాల పరంగా ఇప్పుడు యాక్టీవ్ గా కనబడుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన నటించిన రెండు సినిమాలు ఆడియన్స్ ని మెప్పించగా.. మొన్న వచ్చిన బ్రో మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజాకీల విషయంలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. తెలంగాణాలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. అటు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో ఎంతోకొంత క్రేజ్ ఉంది.
కానీ తెలంగాణాలో జనసేనకు ఏ ఏరియాలోను పట్టులేదు. ఎక్కువగా BRS లేదంటే కాంగ్రెస్, బీజేపీ, MIM పార్టీలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీకి తెలంగాణాలో మనుగడ లేదు. బీజేపీతో కలిసి పోటీ చేసి చేతులు కాల్చుకోవడం తప్ప జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అంటూ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే గనక ఈ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా జనసేన గెలవకపోతే పరువు పోవడం తర్వాత అక్కడ ఏపీలో జనసేనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
అదే జరిగితే 2024 ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ జనసేన గ్రాఫ్ తగ్గుతుంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ తో కలిసి అడుగులు వేస్తుంది జనసేన. అక్కడ సీట్స్ విషయం ఇంకా తేలలేదు. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ లో జనసేన పరిస్థితిని బట్టి అంచనా వేసి టీడీపీ జనసేనకు ఏపీలో సీట్స్ కేటాయించే ఆలోచనలో ఉంది అంటున్నారు. అదే జరిగితే జనసేన కూడా CPM, CPI పార్టీల మాదిరిగా ఏమి చెయ్యలేక ఉండిపోవాల్సి వస్తుంది అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి.
అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇచ్చినా పోటీ చెయ్యకుండా ఉంటే బావుండేది.. టీడీపీ లాగా తెలంగాణ ఎన్నికలకి దూరంగా ఉంటే బావుండేది, అక్కడ ఏపీలో జనసేనకు మైలేజ్ పెరిగేది.. దీనిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేసారా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.