గత మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో అందరూ ఎమోషనల్ గా మారిపోతున్నారు. ఫ్యామిలీ వీక్ అంటూ 11 మంది కుటుంభ సభ్యులని హౌస్ లోకి తీసుకొచ్చారు. శివాజీ కొడుకు ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ ఫ్యామిలీ వీక్ యావర్ అన్నతో ఎండ్ అయ్యింది. శివాజీ కొడుకుని చూసి ఏడ్చేశాడు. ఆ తర్వాత అర్జున్ వైఫ్ వచ్చింది.. ఆమె ఎమోషనల్ గా హౌస్ ని కట్టిపారేసింది. ఇది అశ్విని అయితే తల్లిని చూసి ఏడుస్తూనే ఉంది.
నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ తల్లి వచ్చారు. ఆమె అందరికి ముద్దలు తినిపించారు. ఆ తర్వాత ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ వచ్చాడు. అతను ప్రియాంకని ముద్దులతో ముంచెత్తాడు. ఇక భోలే వైఫ్ కూడా హౌస్ లోకి వచ్చారు. ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా అమరదీప్ వైఫ్ వచ్చింది. ముందుగా అమరదీప్ పుట్టిన రోజు స్పెషల్ గా అమరదీప్ కి కేక్ పంపించారు. దానితో అతను సంతోషపడిపోయాడు. తర్వాత హౌస్ మేట్స్ భార్యని చూపించగానే అమరదీప్ సర్ ప్రైజ్ అయ్యాడు.
అమరదీప్ వైఫ్ తర్వాత శోభా శెట్టి మదర్ వచ్చారు. ఆమె కూడా హౌస్ మేట్స్ తో చాలా బాగా మాట్లాడింది. తెలుగు రాకపోయినా.. వచ్చిన తెలుగులోనే ఆమె అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత యావర్ అన్న వచ్చాడు. యావర్ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే అతను ఓదార్చాడు. దానితో యావర్ హ్యాపీగా కనిపించిన ప్రోమో వైరల్ గా మారింది. ఫైనల్ గా రతిక ఫ్యామిలీ మెంబెర్స్ రావాల్సి ఉంది.