వైసీపీ నేతలను వైచీపీ నేతలు అంటుంటుంది ప్రజానీకం. ఎందుకంటే వారి ప్రవర్తన అంత చీప్‌గా ఉంటుంది. మంత్రులైతే రెచ్చిపోయి మరీ అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరికి బూతుల మంత్రులని.. సంబరాల రాంబాబు అని ఒకరికి.. డైమండ్ రాణి అని ఒకరికి వారి ప్రవర్తనను బట్టి జనం పేర్లు తగిలించేశారు. అసలు పేర్ల కన్నా జనం పెట్టిన ఈ పేర్లతో వారు మరింత ఫేమస్ అయిపోయారు. తమ నియోజకవర్గాలకు వైసీపీ నేతలు ఏం చేశారో ఏమో తెలియదు కానీ పార్టీ అధిష్టానం ఆదేశాలకు మాత్రం అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటారు. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఆపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.
మీడియా, సోషల్ మీడియా ద్వారా టార్గెట్..
ఇక చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఎప్పుడూ రాజకీయాల్లో వేలు పెట్టని ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి జనంలోకి వచ్చారు. దాన్ని కూడా జీర్ణించుకోలేపోయారు వైసీపీ నేతలు. వారిద్దరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై సైతం ఇష్టానుసారంగా మాటలు జారుతున్నారు. తొలుత అసలు వైసీపీలో అడ్డూ అదుపు లేని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆమెను విమర్శించడంతో మొదలైన ఈ పరంపర.. మంత్రి రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ వీరు చాలదన్నట్టు.. సినీ దిగ్గజాలుగా ఫీలయ్యే వైసీపీ అనుచరులు పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ వరకూ మీడియా ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో టార్గెట్ చేశారు. ఇక అంతలా టార్గెట్ చేయడానికి ఆమె చేసిన తప్పులు చాలా ఉన్నాయని వారి ఫీలింగ్.
కేవలం ఆ భేటీలో పాల్గొన్నారంతే..
చంద్రబాబు నాయుడి అరెస్ట్ అనంతరం బీజేపీ అధిష్టానంతో పురందేశ్వరి మాట్లాడి ఆయనను కేసుల నుంచి తప్పిస్తున్నారన్న అపోహ ఒక కారణమైతే... నారా లోకేష్‌ని వెంటబెట్టుకొని ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవడం రెండో కారణం. నిజానికి లోకేష్‌ను వెంటబెట్టుకెళ్లింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేవలం పురందేశ్వరి ఆ భేటీలో పాల్గొన్నారంతే. విషయం తెలిసినా కూడా ఆమెను వైచీపీ నేతలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరో కీలక విషయం ఏంటంటే.. ఏపీ సీఎం జగన్, విజయ సాయిరెడ్డిల అక్రమాస్తుల కేసులను వేగవంతం చేసేందుకు ఆమె కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది వైసీపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పించింది. కానీ ఎన్టీఆర్ కుమార్తెను ఇంతలా వైసీపీ నేతలు అవమానిస్తుంటే జనం చూస్తూ ఊరుకుంటారా? అభివృద్ధిని గాలికొదిలేసి నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా అతి అనర్థమే.