సోషల్ మీడియాలో సలార్ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వని రోజు లేదు. డిసెంబర్ 22 న డైనోసార్ దిగుతుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే మధ్యలో కొంతమంది దూరి సలార్ పై విషం కక్కుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సలార్ పై నెగెటివ్ న్యూస్ లు ప్రచారం చేస్తూ అభిమానులని ఆందోళనలో పడేస్తున్నారు. దానితో సలార్ అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్ ని డిమాండ్ చేస్తే స్థితికి అభిమానులు వచ్చేసారు. మరి ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మేకర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంది.
ఈ గాసిప్స్ అన్నిటికి పర్ఫెక్ట్ గా సమాధానమిస్తూ డిసెంబర్ 22 న సలార్ పక్కాగా థియేటర్స్ కి వస్తుంది అంతేకాదు సలార్ ట్రైలర్ డిసెంబర్ 1 న ఇస్తున్నామంటూ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చేసారు. ఇప్పటివరకు సలార్ ట్రైలర్ వదిలితే ఇప్పటివరకు ఉన్న లెక్కలు మరిపోతాయి, ఇకపై విధ్వంశమే అన్నట్టుగా సలార్ ట్రైలర్ డేట్ చూసేసరికి సోషల్ మీడియా షేకయ్యింది. ప్రభాస్ అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. మరి ట్రైలర్ వస్తుంది అని తెలిస్తేనే ఇలా ఉంటే.. వచ్చాక ఎలా ఉంటుందో.. గెట్ రెడీ ఫ్యాన్స్.. విధ్వంసానికి సమయం దగ్గరపడుతోంది.