కొన్నిరోజులుగా సలార్‌పై పనిగట్టుకుని కొంతమంది ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. సలార్ రిలీజ్ డిసెంబర్ 22కి ఉండకపోవచ్చు, మేకర్స్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ నుంచి బయటికి రాలేదు అని. ఇంకొంతమంది మరింతగా ముందుకు వెళ్లి ప్రభాస్ పేరు తియ్యకుండా, సలార్ పేరు ఎత్తకుండా ఒక భారీ బడ్జెట్ మూవీ, ఓ స్టార్ హీరో సినిమా నార్త్ ఇండియా డీల్ క్యాన్సిల్.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమా అనుకున్న సమయానికి రావడం అసాధ్యం అంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు.
ఆ ప్రచారం సలార్ మీదే, ఆ స్టార్ హీరో ప్రభాస్ అని చాలామందికి ఓ క్లారిటీ వచ్చింది. అలాంటి ఫేక్ న్యూస్‌లకు సలార్ మేకర్స్ ధీటుగా సమాధానమిచ్చారు. ఆ ట్వీట్లు పడిన గంటకి సలార్ మేకర్స్ నుంచి సూపర్ క్లారిటీ వచ్చేసింది. సలార్ డిసెంబర్ 22 విడుదల అంటూ ఓ వీడియో క్లిప్‌ని సలార్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి షేర్ చేశారు. 💥💥💥 #SalaarCeaseFireOnDec22 అంటూ షేర్ చేసిన వీడియోలో ప్రభాస్ యాక్షన్ చేస్తూ విలన్స్ తల నరుకుతూ కనిపించారు. కానీ ఆ వీడియో జస్ట్ నీడ మాత్రమే. అయినా సలార్ మేకర్స్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై క్షణాల్లో వైరల్ అయ్యింది.
ఇక నిన్న బుధవారం ప్రభాస్ ఇటలీ వెకేషన్ ముగించుకుని ఇండియాకి వచ్చేశారు. ఇకపై సలార్ ప్రమోషన్స్ మొదలైపోతాయని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. వన్స్ సలార్ ట్రైలర్ వచ్చాక ఇప్పుడున్న క్రేజ్, అంచనాలు మరింతగా పెరగడమే కాదు.. మొత్తం మారిపోతుంది అంటూ వారు కాన్ఫిడెంట్‌తో కనిపిస్తున్నారు.