అనసూయ జబర్దస్త్ ని వదిలాక ఆమె ప్లేస్ లోకి ముందుగా రష్మీ గౌతమ్ వచ్చింది. రష్మీ గౌతమ్ కూడా టెంపరరీ యాంకర్ గానే ఉంది. ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ నే యాంకర్ కాబట్టి కొత్తదనం కోసం కన్నడ నటి సౌమ్య రాయ్ ని జబర్దస్త్ కి యాంకర్ గా తీసుకొచ్చారు. ఆమె తెలుగు బాగానే మాట్లాడినా చాలా స్పీడుగా మాట్లాడుతుంది అనే కంప్లైంట్ బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఉంది. సౌమ్య కూడా గ్లామర్ గానే కనిపించేది. కమెడియన్స్ తో కలిసి డాన్స్ లు వెయ్యడం స్కిట్స్ చెయ్యడం.. జెడ్జెస్ తో క్లోజ్ గా అంతా బాగానే నడుస్తుంది. ఏదైనా అనసూయ అంత ఊపు జబర్దస్త్ లో మాత్రం కనిపించలేదు. అనసూయ అందం, మాట తీరు, ఆమె గ్లామర్ షో అన్నీ షోకి వన్నె తెచ్చాయి.
ఇక ప్రస్తుతం జబర్దస్త్ నుంచి టాప్ కమెడియన్స్ అందరూ ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నారు. దానితో షో పై క్రేజ్ కూడా ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. అందుకేనేమో జబర్దస్త్ యాజమాన్యం యాంకర్ ని మార్చేసింది. సౌమ్య రాయ్ ప్లేస్ లోకి సిరిని తీసుకొచ్చారు. బిగ్ బాస్ లో షణ్ముఖ్ తో ఫ్రెండ్ షిప్ వలన ఆమె ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయినా.. ఆమె గ్లామర్ తో హైలెట్ అయ్యింది. గత బిగ్ బాస్ సీజన్ శ్రీహన్ తో ప్రేమాయణం నడిపే సిరి షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది.
ఈ వారం అంటే గురువారం జబర్దస్త్ లోకి సిరి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ సిరి కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. కృష్ణభగవాన్ కూడా సిరికి వెల్ కమ్ చెప్పిన ప్రోమో వైరల్ గా మారింది. మరి సిరి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందో లేదంటే.. పర్మినెంట్ యాంకర్ గా ఉంటుందో అనేది ఆసక్తిగా మారినా.. జబర్దస్త్ స్టేజ్ మాత్రం సిరి ఎంట్రీ తో కలర్ ఫుల్ గా మారింది అని చెప్పొచ్చు. ఇక అప్పుడప్పుడు ఇంద్రజ కూడా జెడ్జ్ ప్లేస్ లో మాయమై ఆమె ప్లేస్ లో సదా కనబడుతుంది. అందుకే సిరి విషయంలో అంతగా డౌట్ పడేది.