యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ తో కొరటాలతో దేవర సినిమాని మొదలు పెట్టారు. ఆ సినిమా మొదలు పెట్టడమే సూపర్ అప్డేట్ లతో ఫాన్స్ ని కూల్ చేసారు. అంతకు ముందు ఎన్టీఆర్-కొరటాల మూవీ అప్డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసారు. ఎన్టీఆర్ కూడా కొన్నిసార్లు అభిమానులపై చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా దేవర మొదలయ్యాక అప్ డేట్స్ తో అభిమానులకు గుక్క తిప్పుకోకుండా సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు.
నిన్నటికి నిన్న దేవర మూవీ పార్ట్ 1 విడుదలకి ఇంకా 150 రోజుల సమయమే ఉంది అంటూ ఏప్రిల్ 5 న విడుదల అని మరోసారి పోస్టర్ వేసి అప్డేట్ ఇచ్చారు. అది చూసాక కొంతమంది ఇలాంటి అప్ డేట్స్ వస్తూ ఉంటే ఇంకా ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది.. ఇలానే సలార్ కి కూడా చేస్తే బావుంటుంది అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. సలార్ విడుదలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. డిసెంబర్ 22 న సినిమా విడుదల అంటున్నారు. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి అప్డేట్ ఉండడం లేదు.
మరోపక్క సలార్ పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు రేజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఈరోజు బుధవారం ఇటలీ నుంచి ఇండియాకి వచ్చేసారు. ఇప్పటికైనా సలార్ ప్రమోషన్స్ మొదలు పట్టాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. సలార్ పోస్టర్స్ వదులుతూ కాస్త హంగామా చెయ్యాలని వారి కోరిక. పాటలు కేవలం రెండే ఉన్నాయి. అవి డిసెంబర్ మొదటివారంలో ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అది నమ్మాలో.. లేదో.. అని అయోమయంలో ఫాన్స్ ఉన్నారు. మరి విడుదలకు సమయం సమీపిస్తున్న కొలది ప్యాన్ ఇండియా ప్రేక్షకులలో ఆత్రుత, అభిమానుల్లో ఆరాటం ఎక్కువైపోతోంది.