అల్లు అర్జున్ పుష్ప చిత్రం సౌత్ నుంచి నార్త్ వరకు ఆడియన్స్ లో ఎంతటి బలమైన ముద్ర వేసిందో అనేది ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పి చూపించారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ అవడంతో దేశ వ్యాప్తంగా పుష్ప మూవీ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చే రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఇంకా పుష్ప గురించి మాట్లాడుకునేలా చేసింది ఆ సినిమాలోని పాటలు, శ్రీవల్లిగా రష్మిక రారా సామి అంటూ ప్రతి స్టేజ్ పై ఆ పాటకి డాన్స్ చేసి అందరికి గుర్తుండిపోయేలా చేసింది. సమంత ఉ అంటావా మావా అనే పాట, శ్రీవల్లి పాట వేటికవే ప్రత్యేకం. శ్రీవల్లి పాటైతే క్రికెట్ మైదానంలోనూ కనిపించింది.
తాజాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ పుష్ప లోని శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ స్టెప్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయ్యాయి. కౌన్ బనేగా కార్డు పతి 15 వ సీజన్ లో అమితాబ్ పుష్ప గురించి అలాగే శ్రీవల్లి సాంగ్ గురించి మట్లాడుతూ.. పుష్ప చిత్రం నిజంగా ఓ అద్భుతం, శ్రీవల్లి పాట ఎంతగా ఫేమస్ అయ్యింది చెప్పక్కర్లేదు. ఆ పాటలో హీరో డాన్స్ చేస్తూ చెప్పు వదిలేసే సీన్ కూడా అంతలా వైరల్ అవడం నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చూసాను. చాలామంది ఆ పాట స్టెప్స్ ని అనుకరించారు.
స్టెప్స్ మాత్రమే కాదు.. హీరో చెప్పు వదిలేసి మరీ వేసుకునేవారు. ఎక్కడ చూసినా శ్రీవల్లి పాటే వినిపించేది. ఎక్కడబడితే అక్కడ ఆ స్టెప్స్ వేసి ఆ పాటని పాపులర్ చేసారు అంటూ అమితాబ్ చేసిన పుష్ప మూవీపై కామెంట్స్ కి అల్లు అర్జున్ అభిమానులు మైమరచిపోయి సంబరాలు చేసుకుంటున్నారు.