మహేష్ బాబు గుంటూరు కారం నుంచి నిన్న త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ గా విడుదలైన ధమ్ మసాలా సాంగ్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. మహేష్ అభిమానులే ఈ పాట చూసి కాస్త నిరుత్సాహ పడ్డారు. విజువల్స్ కూడా ఫస్ట్ లుక్ అప్పటినుంచే చూస్తున్నాము, అదే మహేష్ నే మళ్ళీ మళ్లీ పాటలో చూపించారు అందులో కొత్తేమి లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమందికి సాంగ్ నచ్చినా.. మరికొంతమంది అంచనాలకు ఈ పాట సరితూగలేదు అంటున్నారు.
లిరిక్స్ బావున్నా విజువల్స్ డిస్పాయింట్ చేసాయి, మహేష్ బాబుని ఒకే ఒక లుక్ లో చూపించారు, కనీసం విజువల్స్ అయినా మంచిగా ఇవ్వాల్సింది అని ఒకరంటే.. ఈ పాట స్లో పాయిజన్.. స్లోగా ఎక్కేస్తుంది అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన లిరిక్స్ లో పసలేదు అంటుంటే.. థమన్ మ్యూజిక్ లో సరకు లేదు అని కొందరు అంటున్నారు, ఆ పాట విన్నాక మాటల్లేవు.. దిల్ ఖుష్ అని ఒకరు పొగిడితే.. పాట యావరేజ్ కానీ మహేష్ లుక్స్ ఫైర్ అంటూమరికొందరు కామెంట్స్ పడుతున్నారు.
యావరేజ్ ఉంది ఈ పాట.. నెస్ట్ సాంగ్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే, ఈ పాట ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, అంతలా ఏం లేదులే. ఈ సాంగ్ కన్నా మొన్న వచ్చిన లింగిడి సాంగ్ బెటర్ అనిపిస్తోంది ఈ తమన్ ని ఎందుకు తీసుకున్నాడో.. కానీ Mb లుక్స్ మాత్రం🔥🔥, మిగతాది అసలు బాలేదు అంటూ గుంటూరు కారం సాంగ్ పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. మరి ఈ పాటపై మీ అభిప్రాయమేమిటో.. కింద కామెంట్స్ బాక్స్ లో షేర్ చెయ్యండి..