మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న వారంలోపే పనిలో పడిపోయాడు. నవంబర్ 1 న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలెక్కిన వరుణ్ తేజ్.. పెళ్ళయ్యి వారం పూర్తయిన వెంటనే ఏ హనీమూన్ కో వెళతాడు అనుకుంటే.. తన వర్క్ కోసం ముంబై వెళ్ళాడు. గత వారం వరుణ్ తేజ్-లావణ్యల వివాహం ఇటలీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత చిన్నపాటి రిసెప్షన్ ని ఇటలీలోని ముగించుకుని ఈ జంట హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది.
హైదరాబాద్ లో కూడా ఆదివారం సాయంత్రం ప్రముఖుల సమక్షంలో మరో రిసెప్షన్ ని గ్రాండ్ గా చేసుకున్న వరుణ్ తేజ్ ఈ రోజు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం ఒంటరిగా ముంబై వెళ్ళాడు. అయితే హైదరాబాద్ రిసెప్షన్ తర్వాత వరుణ్ తేజ్-లావణ్య లు డెహ్రాడూన్ లో లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబెర్స్, సన్నిహితులు, ఫ్రెండ్స్ మధ్యన మరో రిసెప్షన్ కోసం లావణ్య ఫ్యామిలీ మెంబెర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా టాక్ వినిపించింది. ఇక ఇవన్నీ ముగించుకుని కొత్త జంట హనీమూన్ ట్రిప్ వేస్తుంది అనుకున్నారు.
కానీ వరుణ్ తేజ్ ఈరోజు ముంబై వెళ్ళింది ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కోసమే అంటున్నారు. అంటే ముందు వర్క్, తర్వాతే ఎంజాయ్మెంట్ అని వరుణ్ తేజ్ ఇలా పనిలో పడిపోయినట్లుగా తెలుస్తుంది.