పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఆయన చేస్తున్న సినిమాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమాల అప్‌డేట్స్ పేరుతో మీడియాకు చెందిన ఓ పర్సన్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటాడనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అవడంతో పాటు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా నీరసం తెప్పించాయి. అయితే ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన కౌంటర్‌కి.. ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేసింది.
విషయంలోకి వస్తే.. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్‌గా అబ్బాయ్ వరుణ్ తేజ్ పెళ్లికి ఫ్యామిలీతో సహా వెళ్లి వచ్చిన పవన్.. ఆ వెంటనే తెలంగాణలో ఏర్పరచుకున్న పొత్తు నిమిత్తం బిజెపీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేస్తున్నట్లుగా అభ్యర్థుల వివరాలను కూడా ప్రకటించారు. ఆ వెంటనే పిఎమ్ నరేంద్రమోడీతో కలిసి హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఇలా రాజకీయంగా పవన్ బిజీగా ఉండటంతో.. ఇక ఆయన చేస్తున్న సినిమాలు అటకెక్కినట్లుగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం మొదలెట్టారు.
పైన చెప్పుకున్న మీడియాకు చెందిన పర్సన్.. జనవరి నుంచి దర్శకుడు హరీష్ శంకర్, హీరో రవితేజ సినిమా.. ఇప్పటి వరకు 20 రోజుల జరిగిన ఉస్తాద్ భగత్‌సింగ్.. అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన హరీష్ శంకర్.. రెండూ రాంగ్.. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక.. అని సమాధానమిచ్చారు. దీనికి.. ఓకే అండీ.. విల్ క్రాస్ చెక్.. అండ్ అప్‌డేట్.. పెద్దవారి సలహా శిరోధార్యం.. అంటూ మీడియా పర్సన్ ఓ నమస్కారం పెట్టాడు. అయినా వదలని హరీషుడు.. పెద్దవారి సలహా శిరోధార్యం.. ముందు తగ్గించుకోవాల్సింది ఈ ఎటకారాలే!! అంటూ కౌంటరేశారు. ఇదంతా చూస్తున్న నెటిజన్లు, మెగాభిమానులు ఉస్తాద్ హరీష్ శంకర్ ఊపు సూపరెహే అంటూ కామెంట్స్‌తో.. హరీష్‌కు ఇంకాస్త ఊపు తెప్పించారు.