ఇటలీ నుంచి డైనోసార్ హైదరాబాద్ లో దిగింది ఇక రచ్చే ఇది ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్. గత కొద్ది రోజులుగా ప్రభాస్ హైదరాబాద్ లో లేరు, ఇటలీలో ఉన్నారు. ఆయన నీ సర్జరీ కోసం ఇటలీ ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే, సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయినా కొద్దిపాటి రెస్ట్ కోసం ఆయన ఇటలీలోనే ఉండిపోయారు. ఇక ఈ రోజు బుధవారం ప్రభాస్ ఇటలీ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఫొటోస్ చూసిన ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.. అందులో భాగమే డైనోసార్ దిగింది ఇక రచ్చే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. సలార్ విడుదలపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ప్రభాస్ హైదరాబాద్ కి రావడంతో ఇకపై సలార్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయనే ధీమాతో ఫాన్స్ కనిపిస్తున్నారు. డిసెంబర్ 22 న విడుదల కాబోయే సలార్ మూవీ ప్రమోషన్స్ అతి త్వరలోనే మొదలు పెట్టేందుకు మేకర్స్ చూస్తున్నారు. ఒక నెలపాటు ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో సలార్ ప్రమోషన్స్ చేపట్టనున్నారని తెలుస్తుంది.
సలార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబై నుంచి హైదరాబాద్ వరకు సినిమాపై క్రేజ్ పెంచేలా ధూమ్ ధామ్ గా నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట. ప్రభాస్ అన్ని భాషల ఈవెంట్స్ కి హాజరవుతారని తెలుస్తుంది.