పవన్ కళ్యాణ్ బీజేపీకి తో టీడీపీతో దోస్తీ కట్టేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఏపీ లో బీజేపీ జనసేనతో కలిసేందుకు ఇంట్రెస్టింగ్ గా లేదు. కారణం అక్కడ పవన్ కళ్యాణ్ బహిరంగంగానే టీడీపీ తో పొత్తు ప్రకటించారు. ఇక తెలంగాణాలో పవన్ కళ్యాణ్ జనసేనలో బీజేపీ పొత్తు ప్రకటించేసింది. ఇక్కడ జనసేన-బీజేపీ కలిసి పోటీ చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పవన్ బీజేపీ వారితో కలిసి పాల్గొంటున్నారు. ఇక్కడంతా ఓకె ఎలాంటి ప్రోబ్లెం లేదు.
కానీ ఏపీలో జనసేన-టీడీపీ మాత్రమే కలిసాయి. కానీ బీజేపీ జనసేనలో కలిసేందుకు ఆలోచిస్తుంది. టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకోకపోతే జనసేనతో బీజేపీ కలిసేందుకు రెడీ అయ్యేది. కానీ ఇప్పుడు టీడీపీ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉంది. అక్కడ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో బీజేపీ కాస్త సానుకూలంగా ఉందనే అభిప్రాయాలతో పాటుగా.. టీడీపీ తో కలిస్తే ప్రజలు తమని అపార్ధం చేసుకుంటారని బీజేపీ భయపడుతుంది అనే వాదన ఉంది.
అయితే ఇక్కడ తెలంగాణాలో బిజెపి తో కలిసి జనసేన ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ తో పోటీ పడేందుకు సిద్దమవగా.. అక్కడ ఏపీలోనూ ఖచ్చితంగా టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ కలిసి పోటీ చేసేలా పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించగలరనే అంటున్నారు. ఇక్కడ బీజేపీ పవన్ కి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తే అక్కడ ఏపీలోనూ ఈ పొత్తు సాధ్యమయ్యేలా కనబడుతుంది.