బిగ్ బాస్ సీజన్ 7 లోకి వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని రూపంలో అందగత్తె, ఆటలో ఆటగత్తె.. కానీ బిహేవియర్ పరంగా ఆమెని ఎలా అర్ధం చేసుకోవాలో బుల్లితెర ప్రేక్షకులకి అస్సలు అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఆమె ఒకరి దగ్గర ఒకటి.. ఇంకొకరి దగ్గర ఇంకోటి చెబుతూ కాలక్షేపం చేస్తుంది. రీసెంట్ గా డాక్టర్ గౌతమ్ శివాజీని విపరీతంగా అపార్ధం చేసుకోవడానికి కారణం అశ్విని చెప్పిన మాటే. గౌతమ్ ఇప్పటికి ఆమె మాట పట్టుకుని శివాజీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు.
ఇక ప్రియాంక, శోభా శెట్టి డామినేషన్ ఆమె తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా ప్రియాంక ఆటలో, మాటలో స్మార్ట్ గా ఉండడం అశ్విని భరించలేకపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ప్రియాంక ని బ్యాడ్ చేసేలా మాట్లాడుతుంది. ఆడియన్స్ కి ప్రియాంక ని నెగెటివ్ చేసేలా పోట్రె చేస్తుంది. నిన్న నామినేషన్స్ అప్పుడు కూడా ప్రియాంక తో గొడవపడి శోభా శెట్టి వచ్చేసరికి ఏం చెయ్యలేక వాళ్ళ కాళ్ళు మొక్కింది. ఇక ఈ రోజు ఫ్యామిలీ వీక్ ఆమె తల్లిని చూడగానే తెగ ఏడ్చేసింది.
నాకు ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు, నాకు ఇదంతా కొత్త, నన్ను తీసుకుపో అంటూ తెగ ఏడ్చిన ప్రోమో వైరల్ అయ్యింది. అశ్విని మదర్ ఎంతగా చెప్పినా నువ్వు ఏడవకుండా గేమ్ ఆడు అని చెప్పినా అశ్విని ఏడుపు ఆపలేదు. తల్లి ఒడిలో తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసిన నెటిజెన్స్ ఎందుకమ్మా అశ్విని అంతగా ఏడ్చావ్ అంటూ కామెడీగా జోకులు వేసుకుంటున్నారు.