యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ దేవర లుక్ లో అభిమానులని బాగా ఇంప్రెస్స్ చేసాడు. అటు జాన్వీ కపూర్ తంగం లుక్ లోను తెలుగు ప్రేక్షకుల మనసులకి దగ్గరైంది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాబోతున్న దేవర మూవీ విడుదలకి ఇంకా 150 రోజులు మాత్రమే సమాయం ఉంది అంటూ దేవర సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్ట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
దేవర నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది నిమిషాల్లో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది. గోవా షెడ్యూల్ రీసెంట్ గానే పూర్తి చేసుకున్న దేవర మూవీ యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం గోకర్ణ వెళ్ళబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ త్వరగా పూర్తి చేసేసి బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోయే వార్ 2 షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది.
ఇక ఏప్రిల్ 5 న దేవర విడుదలైతే.. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఆ మూవీ సెట్స్ లోకి వెళాల్సి ఉంది. మరి ఇన్ని ప్రాజెక్ట్స్ మధ్యన దేవర 2 ఎప్పుడు వస్తుందో అనేది ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న పెద్ద అనుమానం.