Advertisementt

బిగ్ బాస్ లో ఎమోషనల్ మూమెంట్

Tue 07th Nov 2023 05:55 PM
bigg boss 7  బిగ్ బాస్ లో ఎమోషనల్ మూమెంట్
Emotional moment in Bigg Boss 7 బిగ్ బాస్ లో ఎమోషనల్ మూమెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఈ వారం నామినేషన్స్ రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. శివాజీ, గౌతమ్, భోలే, ప్రిన్స్ ఇంకా అమ్మాయిల్లో రతిక నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యింది. కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది అనుకుంటే.. హౌస్ మేట్స్ కుటుంభ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా శివాజీ పెద్ద కొడుకు తండ్రికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. దానితో శివాజీ చిన్నపిల్లాడిలా మారిపోయి ఏడ్చేశాడు.

ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. గత నెల ఉల్టా పూల్టా లో భాగంగా హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. ప్రతి టాస్క్ లోను గెలుస్తూ మిగతా వాళ్ళకి ఒణుకు పుట్టించే అర్జున్ భార్య ని హౌస్ లో చూడగానే ఎమోషనల్ గా మారిపోయాడు. ఆయన భార్య అర్జున్ తో నీవు ఎమోషన్ ని దాచుకుంటున్నావ్ ఓపెన్ అయితేనే కదా తెలిసేది అంటూ  హిత బోధ చేస్తూ కప్పు ముఖ్యం బిగిలు అని సరదాగా ఆటపట్టించింది. అర్జున్ అంబటి భార్య ప్రెగ్నెంట్.

తర్వాత ఇంట్లోని లేడీస్ అంతా ఆమెకి శ్రీమంతం చేసారు. ఆమెపై శారీ కప్పి గాజులు వేసి ఒళ్ళో పళ్ళు పెట్టి మరీ అందరి మనసులని కదిలించేసారు. అంబటి అర్జున్ అయితే కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేసాడు. ఆమెని పంపిస్తూ హౌస్ మొత్తం గుండెలు నిండా భారంతో కనిపించారు.

Emotional moment in Bigg Boss 7:

Bigg Boss 7 : Today promo goes viral

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ