పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో అర్ధం కాక ఆయన ఫాన్స్ మాత్రమే కాదు ఆయనతో సినిమాలు చేసే దర్శకులూ తలపట్టుకుంటున్నారు. పవన్ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని దర్శకులు గత రేడేళ్లుగా వెయిట్ చెయ్యని రోజు లేదు. అందులో హరీష్ శంకర్ అందరికన్నా ముందుంటాడు. క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు ఏమైపోయిందో తెలియడమే లేదు. ఈలోపు ఉస్తాద్ భగత్ సింగ్ తో కొద్దిగా హడావిడి చేసారు.
ఇక సుజిత్ తోనూ OG అంటూ రాజకీయాలకు గ్యాప్ వచ్చినప్పుడల్లా షూటింగ్ చేసారు. మళ్ళీ ఇప్పుడు పవన్ తన దర్శకులకి మొండి చెయ్యి చూపించేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బిజెపి తో కలిసి పోటీ చెయ్యబోతున్నారు. మోడీ తో కలిసి వేదికని అలంకరిస్తూ తెలంగాణాలో ఎన్నికల ప్రచారం చెయ్యబోతున్నారు. అంటే తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యేవరకు పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లోకి వెళ్లే ఛాన్స్ లేదు. రాజకీయ పార్టీలు పవన్ వెంట పడుతుంటే పవన్ సినిమాలంటూ కూర్చోవడం కష్టం.
మరి మళ్ళీ పవన్ డేట్స్ కోసం పవన్ దర్శకులు ముఖ్యంగా హరీష్ శంకర్ ఎన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ తో చేసిన సీన్స్ లో ఒక గ్లిమ్ప్స్, కొన్ని ఫొటోస్ రూపంలో రివీల్ చేసిన హరీష్ పవన్ ఇచ్చే డేట్స్ ని ఒడిసిపట్టుకుని షూటింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పవన్ ఫాన్స్ తో సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నాడు.