Advertisementt

బిగ్ బాస్ లో కొడుకుని చూసి ఏడ్చేసిన శివాజీ

Tue 07th Nov 2023 01:59 PM
bigg boss sivaji  బిగ్ బాస్ లో కొడుకుని చూసి ఏడ్చేసిన శివాజీ
Bigg Boss Sivaji cried seeing his son బిగ్ బాస్ లో కొడుకుని చూసి ఏడ్చేసిన శివాజీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో అప్పుడే ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. ఇంకా ఐదు వారాల గేమ్ మిగిలి ఉంది. ఇప్పటికి పదిమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా పది మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. అందరూ బలమైన వారే. ఈ సీజన్ టైటిల్ కోసం ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే టాప్5 లో ఉండాల్సిన సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవడంతో అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ మొదలయ్యింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ లో శివాజీ కొడుకు హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. డాక్టర్ గా మారిన శివాజీ కొడుకు ఆయనకి హెల్త్ చెకప్ చేసి సర్ ప్రైజ్ చేసాడు. బిగ్ బాస్ హెల్త్ చెకప్ లో భాగమనుకున్న శివాజీ కొడుకుని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత వెళ్లిపోతుంటే శివాజీ కొడుకు ఆయన్ని డాడ్ అంటూ పిలిచాడు. దానితో శివాజీ ఎమోషనల్ గా మారిపోయి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. హౌస్ లోకి తీసుకొచ్చి మై సన్ అంటూ ప్రౌడ్ గా హౌస్ మేట్స్ కి పరిచయం చేసాడు.

వీడిని డాక్టర్ లా పంపారు అంటూ శివాజీ చాలా ఎగ్జైట్ అవుతూ హౌస్ మేట్స్ తో పంచుకున్నాడు. శివాజీ కొడుకు అందరిని హాగ్ చేసుకుంటూ హౌస్ మొత్తం కలయతిరిగాడు. నువ్వొస్తావనుకోలేదు తమ్ముడొస్తాడనుకున్నాను.. అంటూ కొడుకుని శివాజీ ముద్దు చేసాడు. కొడుకు యూనివర్సిటీ గురించి చెబుతుంటే శివాజీ ఎమోషల్ అయ్యాడు. నువ్వు ఏడవకు నాన్నా నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తారు. నువ్వు నవ్వితే అందరూ నవ్వుతారంటూ కొడుకు శివాజీని ఓదార్చిన ప్రోమో వైరల్ గా మారింది. 

Bigg Boss Sivaji cried seeing his son:

Bigg Boss 7: Today promo goes viral

Tags:   BIGG BOSS SIVAJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ